S.P Eshwar Rao:ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ సంగీత దర్శకుడు ఈశ్వర్ రావు కన్నుమూత

ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్పీ ఈశ్వర్‌రావు అనారోగ్యంతో చెన్నైలో కన్నుమూశారు. 63 ఏళ్ళ వయసులో ఆరోగ్య సమస్యలతో చికిత్స తీసుకుంటూ ఈయన కన్నుమూశారు. 

Music Director S.P Eshwar Rao Passes away

ఈ మధ్య కాలంలో ఫిల్మ్ ఇండస్ట్రీలో వరుస  విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. గత కొద్ది నెలలలోనే అనేక మంది సినీ ప్రముఖులు ఈలోకాన్ని వీడి వెళ్లిపోయారు.  ముఖ్యంగా సంగీత ప్రపంచాన్ని వీడి గాయకులు.. సంగీత ద్శకులు చాలా మంది తనువ చాలిస్తున్నారు. పరిశ్రమకి చెందిన వారు అనేక మంది ఇటీవల మరణించారు. లతా మంగేష్కర్, బప్పి లహరి, సంధ్య ముఖర్జీ, మాణిక్య వినాయగం లాంటి ఎంతో మంది సంగీత ఉద్దండులు రీసెంట్ గా కన్ను మూశారు. 

ఆ బాధ నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీ  తేరుకోకముందే మరో సంగీత దర్శకుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు.ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్పీ ఈశ్వర్‌రావు అనారోగ్యంతో చెన్నైలో కన్నుమూశారు. 63 ఏళ్ళ వయసులో ఆరోగ్య సమస్యలతో చికిత్స తీసుకుంటూ ఈయన మరణించారు. ఈశ్వర్ రావు ఒకప్పటి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్  ఎస్పీ కోదండపాణి కుమారుడు. 

తమిళ, తెలుగు భాషల్లో ఎన్నో సినిమాలకి ఈశ్వర్ రావు సంగీతం అందించారు. దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన సినిమాలకు ఎక్కువగా సంగీత సహకారం అందించారు. వీటితో పాటు అంతఃపురం,శుభలేఖ,జీవితం లాంటి పలు ఈటీవీ సీరియళ్లకు ఈయన మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేశారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈశ్వర్ రావు మరణంతో తమిళ, తెలుగు సినీ పరిశ్రమలో విషాదఛాయలు అలముకున్నాయి.ఈ విషయం తెలుసుకున్న సనీ ప్రముఖులు  ఈశ్వర్ రావ్ కు నివాళులు అర్పిస్తున్నారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios