మహేష్ తో మనస్పర్ధలు నిజమే: మణిశర్మ

music director manisharma comments on mahesh babu
Highlights

టాలీవుడ్ లో ఎన్నో హిట్ ఆల్బమ్స్ చేసిన సంగీత దర్శకుడు మణిశర్మకు పస్తుతం అవకాశాలు 

టాలీవుడ్ లో ఎన్నో హిట్ ఆల్బమ్స్ చేసిన సంగీత దర్శకుడు మణిశర్మకు పస్తుతం అవకాశాలు బాగా తగ్గిపోయాయి. ఒకప్పుడు స్టార్ హీరోలు సైతం ఆయన సంగీతం కోసం ఎదురుచూసేవారు. దాదాపు టాలీవుడ్ అగ్ర హీరోలందరి సినిమాలకు పని చేసిన మణిశర్మకు మహేష్ బాబుతో మనస్పర్ధలు ఉన్నాయని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

'మహేష్ కెరీర్ మొదలైనప్పటి నుండి అయన నటించిన చాలా సినిమాలకు వర్క్ చేశాను. మా మధ్య మంచి సాన్నిహిత్యం ఉండేది. అయితే మా మధ్య ఏవో మనస్పర్ధలు రావడంతో మహేష్ చాలా బాధ పడ్డాడు. ఏ విషయంలో ఆయన బాధపడ్డారో తెలుసుకుందామని ఆయనను కలవడానికి ప్రయత్నించాను కానీ కుదరలేదు. అని స్పష్టం చేశారు. 

ప్రస్తుతం యువ సంగీత దర్శకుల హవా పెరగడం మణిశర్మ చరిష్మా తగ్గడంతో దర్శకనిర్మాతలలో మణిశర్మతో కలిసి పని చేసే ఆలోచన పూర్తిగా తగ్గిపోయింది. ఇక ఆయన తన వద్ద పనిచేసే వారిని  బాగా తిడుతుంటారనే వార్తలు వినిపించేవి. వీటిపై స్పందించిన ఆయన వారిపై నాకు ఎలాంటి కోపం ఉండదు. వర్క్ లో పెర్ఫెక్షన్ కోసం కోప్పడుతూ ఉంటాను అంతే.. అని స్పష్టం చేశారు.

loader