`ఆర్ఆర్‌ఆర్‌`కి తమిళ మ్యూజిక్‌ సెన్సేషన్‌ అనిరుథ్‌ రవిచందర్‌ సంగీతం అందించబోతున్నారు. తాజాగా ఈ సినిమా మ్యూజిక్‌ డైరెక్టర్‌ కీరవాణి ఈ విషయాన్ని తెలియజేశారు.

ఇండియాలోనే ప్రతిష్టాత్మక రూపొందుతున్న చిత్రాల్లో `ఆర్‌ఆర్‌ఆర్‌` ముందుంటుంది. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కలిసి నటిస్తున్నారు. దర్శకధీరుడు రాజమౌళి దీన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే టాకీ పార్ట్ పూర్తయింది. రెండు పాటల బ్యాలెన్స్ ఉన్నాయి. ప్రస్తుతం ఓ ప్రమోషనల్‌ సాంగ్‌ని చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తుంది. ఫ్రెండ్‌షిప్‌ పై ఈ సాంగ్‌ ఉంటుందని సమాచారం. ఇందులో రాజమౌళి పనిచేసిన హీరోలు ప్రభాస్‌, రానా, రవితేజ, ఎన్టీఆర్‌, చరణ్‌ పాల్గొంటున్నారని టాక్‌. ఇందులో నిజమెంతా అనేది తెలియదుగానీ ఈ సినిమాకి సంబంధించి ఇప్పుడు మరో క్రేజీ అప్‌డేట్‌ చక్కర్లు కొడుతుంది. 

ఈ సినిమాకి తమిళ మ్యూజిక్‌ సెన్సేషన్‌ అనిరుథ్‌ రవిచందర్‌ సంగీతం అందించబోతున్నారు. ప్రమోషనల్‌ సాంగ్‌కి తమిళ వెర్షన్‌ మ్యూజిక్‌ని అనిరుథ్‌ అందిస్తున్నట్టు తెలుస్తుంది. తాజాగా ఈ సినిమా మ్యూజిక్‌ డైరెక్టర్‌ కీరవాణి ఈ విషయాన్ని తెలియజేశారు. `ఆర్‌ఆర్‌ఆర్‌` కోసం అనిరుథ్‌తో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. తన సమర్థత, శక్తి, టాలెంట్‌, అద్భుతమైన టీమ్‌ ముఖ్యంగా ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండటం అతని బలం` అని కీరవాణి ట్వీట్‌ చేశారు. దీనికి అనిరుథ్‌ కూడా స్పందించి కృతజ్ఞతలు తెలిపారు. 

Scroll to load tweet…
Scroll to load tweet…

ఇక డీవీవీ దానయ్య దాదాపు నాలుగు వందల కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇందులో కొమురంభీమ్‌గా ఎన్టీఆర్‌, అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌ నటిస్తున్నారు. వారు యంగ్‌ ఏజ్‌లో చేసిన పోరాటం నేపథ్యంలో సినిమా సాగుతుందని తెలుస్తుంది. చరణ్‌ సరసన అలియాభట్‌ హీరోయిన్‌గా సీత పాత్రలో నటిస్తుంది. ఎన్టీఆర్‌ సరసన బ్రిటీష్‌ నటి ఒలివియా మోర్రీస్‌ నటిస్తుండగా, అజయ్‌ దేవగన్‌, శ్రియా, సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల విడుదలైన మేకింగ్‌ వీడియో మిలియన్స్ వ్యూస్ తో దూసుకుపోతుంది. సినిమాపై అంచనాలను మరింతగా పెంచింది. మరోవైపు ఆగస్ట్ 1న ఫ్రెండ్‌షిప్‌ డే సందర్భంగా ప్రమోషనల్‌ సాంగ్‌ని విడుదల చేయబోతున్నారట. ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్‌ 13న ప్రపంచ వ్యాప్తంగా పది భాషల్లో విడుదల చేయబోతున్నారు.