ప్రముఖ లెజెండరీ మ్యూజిక్‌ డైరెక్టర్, ఆస్కార్‌ విన్నర్‌ ఏ.ఆర్‌ రెహ్మాన్‌ ఇంట్లో విషాదం నెలకొంది. రెహ్మాన్‌ తల్లి కరీమా బేగమ్‌ కన్నుమూశారు. సోమవారం ఉదయం ఆమె అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. దీంతో తమిళ చిత్ర పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. రెహ్మాన్‌ తల్లి మరణంతో తమిళ చిత్ర పరిశ్రమ ఒక్క సారిగా షాక్‌కి గురయ్యింది. సినీ ప్రముఖులు తీవ్ర సంతాపం తెలిపారు. 

రెహ్మాన్‌ తొమ్మిదేళ్ల వయసులో నాన్న ఆర్‌.కె.శేఖర్‌ చనిపోయారు. దీంతో అప్పటి నుంచి రెహ్మాన్‌ని తల్లి కరీమా బేగమ్‌(కస్తూరి శేఖర్‌) పెంచి పెద్ద చేశారు. తాను ఈ స్థాయికి రావడంలో తల్లి పాత్ర ఎంతో ఉందని రెహ్మాన్‌ పదే పదే చెబుతుంటారు. ఆమె లేకపోతే తాను లేని అంటున్నారు. అమ్మతో ఎంతో అనుబంధం ఉందని రెహ్మాన్‌కి. తన జీవితానికి ఆమె ఇన్‌స్పీరేషన్‌ అని, అలాంటి తల్లి మరణంతో దుఖసాగరంలో మునిగిపోయారు రెహ్మాన్‌.