బాలీవుడ్ లో 'స్పైడర్' రీమేక్?

Murugadoss planning to make Mahesh Babu's 'Spyder' in Hindi?
Highlights

సూపర్ స్టార్ మహేష్ బాబు, మురుగదాస్ కాంబినేషన్ లో రూపొందిన 'స్పైడర్' సినిమా తెలుగు 

సూపర్ స్టార్ మహేష్ బాబు, మురుగదాస్ కాంబినేషన్ లో రూపొందిన 'స్పైడర్' సినిమా తెలుగుప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ప్రేక్షకులు సినిమాపై పెట్టుకున్న అంచనాలను 'స్పైడర్' అందుకోలేకపోయింది. అయితే తమిళంలో మాత్రం సినిమాకు మంచి టాక్ లభించింది. ఇప్పుడు ఈ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు మురుగదాస్ స్వయంగా వెల్లడించారు.

ఇటీవల నేషనల్ మీడియాతో ముచ్చటించిన మురుగదాస్.. ప్రస్తుతం స్పైడర్ బాలీవుడ్ లో రీమేక్ చేయడానికి సంబంధించిన పనులు జరుగుతున్నాయని అన్నారు. అయితే హీరో ఎవరనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. దీంతో తెలుగు, తమిళ భాషల్లో నటించిన మహేష్ కు బాలీవుడ్ ఛాన్స్ కూడా వస్తుందనే మాటలు జోరుగా వినిపిస్తున్నాయి. అయితే మహేష్ కు ఉన్న కమిట్మెంట్స్ దృష్ట్యా ఆయన ఇప్పట్లో బాలీవుడ్ సినిమా చేసే ఛాన్స్ లేదు.

మరి మురుగదాస్ మైండ్ లో ఏ హీరో ఉన్నాడో కొద్దిరోజుల్లో తెలియనుంది. ప్రస్తుతం మహేష్.. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమాలో నటించడానికి రెడీ అవుతున్నారు!

loader