కోలీవుడ్ స్టార్ దర్శకుల్లో ఒకరైన మురుగదాస్ ఇటీవల సర్కార్ సినిమాతో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్నారు. విజయ్ కథానాయకుడిగా తెరకెక్కిన ఆ సినిమా సౌత్ లో అత్యధిక కలెక్షన్స్ అందుకున్న చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఇకపోతే నెక్స్ట్ ఈ చిత్ర దర్శకుడు ఎలాంటి ప్రాజెక్ట్ తో వస్తాడు అనేది హాట్ టాపిక్ గా మారింది. 

రజినీకాంత్ తో చర్చలు జరుపుతున్నట్లు గత కొంత కాలంగా వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఆ సినిమా తెరకెక్కనుందని సమాచారం. ఇక రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో మురుగదాస్ అజిత్ తో సినిమా గురించి స్పందించాడు. 

అజిత్ ఫ్యాన్స్ మా హీరోతో మళ్ళీ సినిమా ఎప్పుడు చేస్తావ్ అని అడుగుతున్నారు  ఆయన కోసం మంచి కథను రెడీ చేసి ఉంచాను. ఆయన నుంచి ఫోన్ కాల్ వస్తే వెంటనే వెళ్లి చెబుతాను అంటూ మురుగదాస్ వివరణ ఇచ్చారు. అయితే 18 ఏళ్ల క్రితం మురుగదాస్ అజిత్ తో దీనా అనే సినిమా చేశారు. ఆయన మొదటి సినిమా అదే. అయితే ఆ తరువాత మళ్ళీ ఈ కాంబోలో సినిమా రాలేదు. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ చేయడంలో కొన్ని పరిమితులు ఉన్నాయని మురుగదాస్ తెలిపారు.