Asianet News TeluguAsianet News Telugu

హీరో దర్శన్ కి ఊహించని దెబ్బ... కోర్టు తీర్పుతో కుదేలైన స్టార్ హీరో!

మర్డర్  కేసులో జైలుపాలైన దర్శన్ కి కష్టాలు కొనసాగుతున్నాయి. తాజా తీర్పుతో ఆయన మరింత నిరాశ నిస్పృహల్లోకి జారుకున్నాడు. ఇప్పట్లో ఆయన బయటకు వచ్చే సూచనలు కనిపించడం లేదు.. 
 

murder case accused hero darshan judicial custody extended to august 1 ksr
Author
First Published Jul 19, 2024, 1:01 PM IST | Last Updated Jul 19, 2024, 1:06 PM IST

బెంగుళూరు చిత్రదుర్గ ప్రాంతానికి చెందిన రేణుక స్వామి అనే వ్యక్తి మర్డర్ కేసులో దర్శన్, ఆయన ప్రియురాలు పవిత్ర గౌడ, అనుచరులు విచారణ ఎదుర్కొంటున్నారు. వారు పరప్పన అగ్రహార జైలులో విచారణ ఖైదీలుగా ఉన్నారు. దర్శన్ తనకు జైలు ఫుడ్ సరిపడటం లేదు. డయేరియాకి గురవుతున్నాను. విపరీతంగా బరువు తగ్గాను. ఇంటి భోజనం తెప్పించుకునేందుకు అనుమతి ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ వేశాడు.

ప్రభుత్వ న్యాయవాది దర్శన్ పిటిషన్ పై అభ్యంతరం చెప్పాడు. బెయిల్ పిటీషన్ తో పాటు ఇంటి భోజనానికి అనుమతి కోరుతూ దర్శన్ వేసిన పిటిషన్ మీద గురువారం కోర్టులో విచారణ జరిగింది. కాగా దర్శన్, పవిత్ర గౌడ కస్టడీ పొడిగిస్తూ జడ్జి తీర్పు ఇచ్చారు. ఆగస్టు 1 వరకు దర్శన్, పవిత్ర గౌడ కస్టడీ ఎక్స్టెండ్ చేశారు. 

ఇంటి భోజనం, దిండు, పరువు, పుస్తకాలు కావాలన్న దర్శన్ అభ్యర్థనను కూడా తోచిపుచ్చినట్లు తెలుస్తుంది. జైల్లో పౌష్టికాహారం పెడుతున్నారు. అవసరం మేరకు ఇంటి భోజనం, ఇతర సౌకర్యాలకు సంబంధించి జైళ్లశాఖ ఐజీని అభ్యర్థిస్తే ఆయన నిర్ణయం తీసుకుంటారు. కానీ దర్శన్ నేరుగా హై కోర్టును ఆశ్రయించడం సబబు కాదని ప్రభుత్వ న్యాయవాది కీలక పాయింట్స్ లేవనెత్తారు. 

గతంలో కూడా దర్శన్ పై కొన్ని క్రిమినల్ కేసులు ఉన్నాయి. స్టార్ హీరోగా రాజభోగాలు అనుభవించిన దర్శన్ జైల్లో ఒక్క సిగరెట్ కావాలి అంటూ ప్రాధేయ పడుతున్నాడని సమాచారం. కేవలం తన ప్రియురాలు పవిత్ర గౌడ్ కి అసభ్యకర సందేశాలు పంపాడనే కోపంతో దర్శన్... రేణుక స్వామిని మర్డర్ చేశాడని పోలీసుల ప్రాథమిక సమాచారం. విచారణ కొనసాగుతుంది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios