జబర్దస్త్ కామెడీ షోతో పాపులర్ అయిన వినోద్ పై తాజాగా హత్యాయత్నం జరిగింది. హైదరాబాద్ లోని కాచిగూడ దగ్గర కొందరు వినోద్ పై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై వినోద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ఇంటి ఓనరే తనపై హత్యకు ప్రయత్నించాడని వినోద్ చెబుతున్నాడు. ఈ ఘటనలో వినోద్ కంటి భాగంలో తీవ్ర గాయమైంది. 

వినోద్ చెప్పిన వివరాల ప్రకారం పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. జబర్దస్త్ కామెడీ షోలో వినోద్ లేడి గెటప్స్ తో ఆకట్టుకున్నాడు. లేడి గెటప్స్ వినోద్ కు మంచి పాపులారిటీ తీసుకువచ్చాయి. 

ప్రస్తుతం వినోద్ తరచుగా వార్తల్లో నిలుస్తున్నాడు. గతంలో బలవంతంగా కుటుంబ సభ్యులు పెళ్లి చేయడానికి ప్రయత్నించగా వినోద్ చేతిని కోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాజాగా అతడిపై హత్యాయత్నం జరగడం హాట్ టాపిక్ గా మారింది. ఇంటి ఓనర్ ఎందుకు వినోద్ పై హత్యకు ప్రయత్నించాడు.. వారిద్దరి మధ్య ఉన్న విభేదాలు ఏంటి లాంటి విషయాలు తెలియాల్సి ఉంది.