Krishna Mukundha Murari: స్టార్ మా లో ప్రసారమవుతున్న కృష్ణ ముకుంద మురారి సీరియల్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ నేపథ్యంలో వస్తుంది. అందరి హృదయాలను దోచుకుంటూ మంచి రేటింగ్ తో తీసుకుపోతుంది. ఇక ఈరోజు మార్చి 10 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.
ఎపిసోడ్ ప్రారంభంలో ఆఫీస్ కి వెళ్తావు అని చెప్పావు ఇక్కడున్నావు ఏంటి? అని ముకుంద, మురారిని అడుగుతుంది. నేను ఆఫీస్ కి వెళ్ళలేదని నీకెలా తెలుసు అని అడుగుతాడు మురారి. అంటే ఆఫీస్ టైం లో ఇక్కడ ఉన్నావు కదా అయినా ఉమ్మడి కుటుంబం మధ్యలో కొత్తగా పెళ్లయిన వాళ్లు ఏకాంత సమయం కావాలంటే ఇలాగే బయటకు వస్తారులే అని మురారి వైపు కోపంగా చూస్తూ అంటుంది ముకుంద.
మరోవైపు కృష్ణ,మురారి కి పానీ పూరి తినిపిస్తూ మూతి తుడుస్తూ ఉంటుంది. దాన్ని చూసి కుళ్ళుకుంటుంది ముకుంద. అప్పుడు కృష్ణ, ముకుందతో బోటిక్ కి వెళ్తాను అన్నావు కదా వెళ్ళు మేము ఇంక బయలుదేరుతాము అని ముకుందని పంపించేసి, ఎసిపి సర్ ఒకసారి మళ్ళీ కార్ ప్రయత్నించండి స్టార్ట్ అవుతుందేమో అని అంటుంది. మురారి వెళ్లి కార్ స్టార్ట్ చేయగా ఈసారి కార్ స్టార్ట్ అవుతుంది. కృష్ణ లోపలికి వచ్చి చూశారా సార్ కారులో లేదు మీ మనసులోనే ఏదో అలజడి ఉన్నది.
ఎప్పుడు మిమ్మల్ని బాడ్ మూడ్ నుంచి బయటకు తెప్పిద్దామన్న ఎందుకో ముకుంద మధ్యలో వస్తుంది నాకు ఆ విషయం నచ్చలేదు సార్. మనల్ని బయట చూస్తే చూసి చూడనట్టు వెళ్లిపోవాలి కానీ మధ్యలోకి వచ్చి కలగజేసుకోవడం ఎందుకు అని అంటుంది కృష్ణ. వాళ్ల సంస్కారం అంతే అని చెప్పి ఊరుకోవడమే అని అంటాడు మురారి. ఆ తర్వాత సీన్లో ముగ్గురు ఇంటికి వస్తారు. ముగ్గురు కలిసి వస్తున్నారు ఎందుకు అని భవాని అడుగుతుంది.
వాళ్ళిద్దరూ కలిసి వచ్చారు నేను నా కారులో వచ్చాను అని అంటుంది ముకుంద.భవాని పైకి వెళ్తుండగా పెద్ద అత్తయ్య నేను మీతో కొంచెం మాట్లాడాలి అని అంటుంది కృష్ణ. మాట్లాడడానికా లేకపోతే కొత్త గొడవ తేవడానికి ఎందుకు ప్రతిసారి ఏదో ఒక అలజడి సృష్టించేలా చేస్తావు అని అంటుంది భవాని. ఒకసారి నేను చెప్పేది వినండి మనం నందినీకి వాడుతున్న టాబ్లెట్లు తప్పు. అది స్లో పాయిజన్ లాగా మెదడులోకి వెళ్తున్నారు నరాలను చిట్లింప చేస్తుంది.
మనిషి గతం మర్చిపోవడానికి కారణం అవుతుంది.నందిని గతం మర్చిపోవడానికి కారణం ఆ మెడిసిన్లే అని అనగా ఆ విషయం నీకు ఎవరు చెప్పారు అని అడుగుతారు కృష్ణ వాళ్ళ మావయ్య. మా సీనియర్ మోస్ట్ డాక్టర్ గౌతమ్ సార్ చెప్పారు అని అనగా ఏదో నీకే అని తెలిసినట్టు మాట్లాడతావేంటి మేము అన్ని టెస్టులు చేయించుకున్న తర్వాతే ఈ టాబ్లెట్లు తీసుకుని వచ్చాము ఆ డాక్టర్లు తెలివితక్కువ వాళ్లేం కాదు నువ్వు మాకు చెప్పాల్సిన అవసరం లేదు అని అంటుంది భవాని.
కళ్ళముందే నందిని జీవితం పాడవుతుంటే చూడడం మీకు ఇష్టమా? చేతులారా మీరే తన జీవితాన్ని పాడు చేస్తున్నారు అని కృష్ణ అనగా మధ్యలో ముకుంద కలగజేసుకుంటూ పెద్ద అత్తయ్య గారిని అంత మాట అనడానికి నీకు ఎలా నోరు వచ్చింది కృష్ణ. నిన్న కాక మొన్న వచ్చావు అన్నీ నీకే తెలిసినట్టు మాట్లాడతావు అని అంటుంది. నేను నిన్న కాక మొన్న వస్తే నువ్వు ఏమైనా చిన్నప్పటినుంచి ఇక్కడే ఉన్నావా?
నాకన్నా నాలుగు రోజుల ముందు వచ్చావు నువ్వు మాట్లాడొద్దు అని అంటుంది కృష్ణ. ఆ మాటలకి ముకుంద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నీ భార్య నోరుని అదుపులో పెట్టుకోమని చెప్పు మురారి అని భవాని అనగా తను తప్పేం మాట్లాడలేదు కదా తను చెప్పేది వినండి నా చెల్లెలు జీవితం అలా పాడవుతుంది నేను కళ్ళారా చూస్తూ ఊరుకోలేను అని అంటాడు మురారి. ఇంతలో నందు అక్కడికి వస్తుంది వెంటనే వెళ్లి కృష్ణని హత్తుకుంటుంది.
అప్పుడు కృష్ణ ఈ మాత్రలు వేసుకుంటే నీకు ఎలా ఉన్నాదో వీళ్ళందరికీ చెప్పు అని అనగా భవాని అని అంటుంది నందిని. భవాని కాదు నేను నీకు ఏ పేరుతో పిలవమని చెప్పాను అలాగే పిలువు అంటుంది కృష్ణ. అమ్మ అని నందిని అంటుంది. ఆ మాటలకు భవాని వెళ్లి గట్టిగా నందిని హత్తుకుంటుంది. ఆ టాబ్లెట్లు వేస్తే నాకు నరాలు చిట్లిపోయినట్టు అనిపిస్తుంది సూదితో ఎవరో గుద్దుతున్నట్టు అనిపిస్తున్నాయి. ఇంక ఇవి వద్దు అని ఏడుస్తూ అంటుంది నందిని.
ఆ మాటలకు అక్కడ ఉన్న వాళ్ళందరూ బాధపడతారు. చెప్పాను కదా పెద్ద అత్తయ్య ఆ టాబ్లెట్లు మంచివి కాదు అని ఇప్పుడు ఆ డాక్టర్ ఎవరో తెలుసుకొని ఏసీపీ సార్ ఆఫీస్ కి వెళ్లి నేనే కేసు పెట్టి ఆ డాక్టర్ జైలుకెళ్లేలా చేస్తాను అని అనగా నా చెల్లెలు జీవితాన్ని ఇంతవరకు నాశనం చేసిన వాడిని నేను వదలను అని అంటాడు మురారి. ఈరోజు నుంచి ఈ మాత్రలు వేద్దాం పెద్ద అత్తయ్య ప్లీజ్ అందరూ కలిసి నందిని మళ్లీ నయం చేద్దాము.
నా మాట వినండి అని గౌతమ్ రాసిచ్చిన టాబ్లెట్లు చూపిస్తూ అంటుంది కృష్ణ. ఈరోజు ఇంత పెద్ద గొడవగా కావడానికి కారణం నువ్వే కృష్ణ ఈరోజు నుంచి నందిని కి కావాల్సినవన్నీ ముకుందే చూసుకుంటుంది అని అంటుంది భవాని. నేనయితే ఏంటి ముకుంద అయితే ఏంటి మనకు కావాల్సింది నందిని మళ్లీ తిరిగి మామూలు స్థితికి రావడమే కదా అని అంటుంది కృష్ణ. దానికి అందరూ ఆనందిస్తారు. తర్వాత ఎపిసోడ్లో నా ప్రేమ నీకు ఎందుకు అర్థం కావడం లేదు.
నన్ను తక్కువ చేసి మాట్లాడిన నేను సహిస్తాను కాని నా ప్రేమను తక్కువ చేసి మాట్లాడితే నేను సహించను అని ముకుంద అనగా ఏం చేస్తావు అని మురారి గట్టిగా అడుగుతాడు. చెయ్యను చూపిస్తాను అని చెప్పి మేడ మీద నుంచి కిందకు దూకుతుంది ముకుంద.తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.