అప్పటి టాలీవుడ్ హీరో, క్యారెక్టర్ ఆర్టిస్ట్... సీనియర్ నటుడు మురళీ మోహన్ సూపర్ స్టార్ కృష్ణ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఎవరికీ తెలియని అప్పటి కొన్ని విషయాలు పంచుకున్నారు.
మురళీమోహన్ తెలుగు సినీపరిశ్రమలో ఆయనకు ఉన్న ప్రత్యేకత వేరు. కృష్ణ, శోభన్ బాబు లాంటి హీరోల తరువాత ఇండస్ట్రీకి వచ్చిన మురళీ మోహాన్.. వీరంతా వరుస సినిమాలతో దూసుకుపోతున్న టైమ్ లో ఎంట్రీ ఇచ్చి.. తక్కువ కాలంలోనే హీరోగా గుర్తింపును తెచ్చుకున్నారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు మురళీ మోహన్
హీరోగా మాత్రమే కాదు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.. నిర్మాతగా, వ్యాపారవేత్తగా, రాజకీయ నాయకుడిగా తన మార్క్ చూపించాడుముళీ మోహన్. ఇక మురళీ మోహన్ కు సూపర్ స్టార్ కృష్ణతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఈ విషయాన్ని రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో చెప్పారాయన. అంతే కాదు కృష్ణ గురించి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను ఆయన శేర్ చేసుకున్నారు.
కృష్ణ, తాను ఇంటర్ లో క్లాస్ మేట్స్ అని మురళీ మోహన్ తెలిపారు. ఆ రోజుల్లో కాలేజీలో కృష్ణ చాలా అందగాడని, అందరూ ఆయన చుట్టూనే తిరిగే వారని చెప్పారు. కాలేజీ చదువు అయిపోయిన వెంటనే ఆయన తేనెమనసులు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారాన్నారు మురళీ మోహన్. ఆ తర్వాత సూపర్ స్టార్ గా ఎదిగి ఈ స్థాయికి వచ్చారని గుర్తు చేసుకున్నారు మురళీ మోహన్.
ఆతరువాత తాను కూడా సినీ పరిశ్రమలో అడుగుపెట్టానని... నటన వైపు నుంచి నిర్మాతగా మారానని అన్నారు మురళీ మోహన్. అయితే ఈ సందర్భంగా ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని ఆయన చెప్పారు. కృష్ణ, నాగార్జున కాంబినేషన్లో వారసుడు అనే సినిమాను నిర్మించానని చెప్తూ... ఈ సినిమాలో తండ్రి కృష్ణను కుమారుడు నాగార్జున నిలదీసే సన్నివేశం ఉందని... ఆ సీన్ చూసిన కృష్ణ అభిమానులు తమ ఇంటి మీదకు గొడవకు వచ్చారని, తనను కొట్టేందుకు కూడా రెడీ అయ్యారని అన్నారు మురళీ మోహన్.
ఇది ఒక సినిమా అని, సినిమాను సినిమాగానే చూడాలని తాను చెప్పినా.. వారు వినలేదని తెలిపారు. కృష్ణ అంటే ఫ్యాన్స్ కి అంత అభిమానమన్నారు. వ్యక్తిగతంగా కృష్ణ చాలా గొప్ప వ్యక్తి అని ..ఆయన నిర్మాతల హీరో అని... సినిమా ఫ్లాప్ అయితే నిర్మాతను ఇంటికి పిలిచి, మరో సినిమా అవకాశం ఇచ్చేవాడని కొనియడారు మురళీ మోహన్. డబ్బులు లేవని నిర్మాత చెపితే, ముందు సినిమా మొదలు పెట్టండి, మిగిలినవి తర్వాత చూసుకుందామని చెప్పేవారని అన్నారు.
కృష్ణ లాంటి మంచి మనసున్న మంచి మనిషిని తాను ఇంత వరకు చూడలేదని అన్నారు మురళీ మోహాన్.ఇంకా అలనాటి విషయాలు చాలా పంచుకున్నారు. ప్రస్తుతం కృష్ణ వృధ్ధాప్యంతో ఇంటికే పరిమితం అయ్యారు. మురళీ మోహన్ వ్యాపార వేత్తగా.. పొలిటీషియన్ గా బిజీగా ఉన్నారు.
