స్టార్ హీరోల సినిమాలకు కొన్ని సార్లు ఎదురయ్యే ఇబ్బందులు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. దర్శకుడు ఎంతో నమ్మకంతో కథ చెబితే ఫ్రెష్ స్టోరీ అని మురిసిపోయే కథానాయకులకు ఈ మధ్య కాపీ కథలని తెలియగానే షాక్ అవుతున్నారు. 

స్టార్ హీరోల సినిమాలకు కొన్ని సార్లు ఎదురయ్యే ఇబ్బందులు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. దర్శకుడు ఎంతో నమ్మకంతో కథ చెబితే ఫ్రెష్ స్టోరీ అని మురిసిపోయే కథానాయకులకు ఈ మధ్య కాపీ కథలని తెలియగానే షాక్ అవుతున్నారు. డిఫరెంట్ సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న స్టార్ దర్శకుడు మురగదాస్ రెండు సార్లు కాపీ ఆరోపణలను ఎదుర్కోవాల్సి వచ్చింది. 

రీసెంట్ గా సర్కార్ కథపై ఆరోపణలు రావడంతో మొదట అలాంటిదేమి లేదని అన్నా కూడా చివరికి విషయం కోర్టు వరకు వెళ్లడంతో 30 లక్షల రూపాయలు అలాగే టైటిల్స్ లో నేమ్ కార్డ్ ఉంటుందని సర్కార్ చిత్ర యూనిట్ మాట ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక మురగదాస్ మాత్రం డిఫరెంట్ గా స్పందిస్తున్నాడు. 

ఇద్దరికి ఒకే తరహాలో ఆలోచనలు రావడం కామన్ అంటూ కవర్ చేస్తున్నప్పటికీ నెటిజన్స్ నుంచి భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి. గతంలో విజయ్ తో చేసిన కత్తి కథపై కూడా కాపీ అంటూ టాక్ వచ్చింది. ఆ సినిమా తెలుగులో ఖైదీ నెంబర్ 150గా రీమేకైనా సంగతి తెలిసిందే. తమిళ్ సినిమా విడుదలైనప్పుడు గొడవలు జరిగినా పెద్దగా హైలెట్ కాకుండా చూసుకున్నారు. 

అయితే తెలుగులో రీమేక్ అయ్యే సమయానికి వివాదం మరింత ముదిరింది. ఆ గొడవను కూడా చీకట్లోనే సెటిల్ చేశారని టాక్. మొదటి సారి అలా జరిగాక కూడా సర్కార్ సినిమాతో మరోసారి మురగదాస్ కాపీ ఆరోపణలు ఎదుర్కోవడం గమనార్హం. విజయ్ ఫ్యాన్స్ చాలా వరకు ఈ కాపీల గోలేంటి సామి అంటూ కౌంటర్లు వేస్తున్నారు. నవంబర్ 6న సర్కార్ సినిమా తమిళ్ తో పాటు తెలుగులో కూడా రిలీజ్ కాబోతోంది.