Asianet News TeluguAsianet News Telugu

రామోజీ ఫిల్మ్ సిటీలోనే... ప్రభుత్వానికి వినతి

ఇక  ‘ముంబై సాగా’  సినిమా విషయానికి వస్తే..ముంబై అండర్‌వరల్డ్, అక్కడి గ్యాంగ్‌స్టర్‌ కథగా తెరకెక్కుతోంది.  ‘ముంబై సాగా’ అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో జాన్‌ అబ్రహాం హీరో. కాజల్‌ హీరోయిన్ గా నటిస్తున్నారు. సంజయ్‌ గుప్తా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఇమ్రాన్‌ హష్మీ, సునీల్‌ శెట్టి, జాకీ ష్రాఫ్, ప్రతీక్‌ బబ్బర్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ దాదాపు ఎనభై శాతం పూర్తైంది. మిగిలిన షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో సెట్ వేసి పూర్తి చేయనున్నారు. 

Mumbai Saga to resume shooting next month in Hyderabad
Author
Hyderabad, First Published Jun 12, 2020, 8:54 AM IST

టీవీ షూటింగ్ లకు, సినిమా షూటింగ్ లకూ ప్రభుత్వాలు ఫర్మిషన్స్ ఇస్తున్నాయి. అయితే చాలా నిబంధనలు, జాగ్రత్తలతో షూటింగ్ లు చేసుకోమని చెప్పింది. అయితే ప్రస్తుతం ముంబైలో ఉన్న కరోనా పరిస్దితిని దృష్టిలో పెట్టుకుని అక్కడ షూట్ చెయ్యటానికి ఎవరికీ ధైర్యం చాలటం లేదు. దాంతో బాలీవుడ్ దృష్టి మన రామోజీ ఫిల్మ్ సిటీపై పడింది.  తెలుగు రాష్ట్రాల్లో నూ పాక్షికంగా లాక్ డౌన్ ఎత్తివేస్తూ,షూటింగ్ లకు ఫర్మిషన్ ఇవ్వటంతో ఇక్కడ వాలిపోతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో ఓ బాలీవుడ్ చిత్రం షూటింగ్ జరుపుకునేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా ప్రభుత్వానికి వినతి పత్రం అందింది. ఆ సినిమా పేరు ముంబై సాగా.

ఫర్మిషన్  లభిస్తే,  ‘ముంబై సాగా’ వచ్చేనెల షూటింగ్ ప్రారంభమవ్వనుంది.12 రోజుల పాటూ జరగనున్న ఈ షెడ్యూల్ లో  జాన్, ఇమ్రాన్ తో పాటూ, సీనియర్ నటులు సునీల్ శెట్టి, జాకీ ష్రాఫ్ కూడా పాలుపంచుకోనున్నారు. ఫిల్మ్ సిటీ లో హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ తీయబోతున్నారని సమాచారం. 
 
ఇక  ‘ముంబై సాగా’  సినిమా విషయానికి వస్తే..ముంబై అండర్‌వరల్డ్, అక్కడి గ్యాంగ్‌స్టర్‌ కథగా తెరకెక్కుతోంది.  ‘ముంబై సాగా’ అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో జాన్‌ అబ్రహాం హీరో. కాజల్‌ హీరోయిన్ గా నటిస్తున్నారు. సంజయ్‌ గుప్తా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఇమ్రాన్‌ హష్మీ, సునీల్‌ శెట్టి, జాకీ ష్రాఫ్, ప్రతీక్‌ బబ్బర్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ దాదాపు ఎనభై శాతం పూర్తైంది. మిగిలిన షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో సెట్ వేసి పూర్తి చేయనున్నారు. 

ఇందులో జాన్‌ అబ్రహాంకు జోడీగా కాజల్‌ కనిపిస్తారు. కాజల్‌ పాత్ర వివిధ వయసుల్లో ఉంటుందట. అందుకోసం రకరకాల గెటప్స్‌లో కాజల్‌ కనిపిస్తారని తెలిసింది. టీ సిరీస్, వైట్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది జూన్‌లో రిలీజ్‌ కానుంది.

ప్రపంచంలోనే అతిపెద్ద ఏకీకృత సినీ నగరం (లార్జెస్ట్‌ ఇంటిగ్రేటెడ్‌ ఫిల్మ్‌సిటీ ఇన్‌ ది వరల్డ్‌)గా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం పొందిన రామోజీ ఫిల్మ్‌సిటీలో కేవలం తెలుగు సినిమాలే కాకుండా బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాలు సైతం షూటింగు జరుపుకుంటున్నాయి. సినిమా షూటింగ్‌ లొకేషన్లు, సెట్టింగ్‌లు, సాంకేతిక సామగ్రి, సదుపాయాలు ఒకేచోట లభ్యమయ్యే ప్రదేశంగా ఫిల్మ్‌సిటీ గుర్తింపు పొందింది. దాంతో ఇప్పుడు బాలీవుడ్ భారీ ఎత్తున తరలనుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios