ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో ఉండే నటి కంగ‌నారనౌత్‌.  ఎప్పుడూ ఎవరో ఒకరిపై  ఏదో ఓ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తూ.. టాక్ ఆఫ్ ది ఇండ్ర‌స్ట్రీగా నిలుస్తూ వస్తోంది. దాంతో ఆమెపై చాలా  పోలీస్ స్టేష‌న్ లో చాలా  కేసులు నమోదు అయ్యాయి. తాజాగా ముంబై కోర్టు.. కంగ‌న‌పై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఓ కేసు నిమిత్తం సోమ‌వారం.. ఆమె కోర్టుకి హాజ‌రు కావాలి. కానీ... ఆమె రాలేదు. దాంతో ముంబై కోర్టు.. కంగ‌న‌పై సీరియ‌స్ అవుతూ, అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.

అందుకు కారణం...ఆ మ‌ధ్య ఓ టీవీ ఛాన‌ల్ కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో గీత ర‌చ‌యిత జావెద్ అక్త‌ర్ ని ఉద్దేశిస్తూ కంగనా కొన్ని వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేయటమే. జావెద్ కూడా `సూసైడ్ గ్యాంగ్‌లో ఒక‌డు` అంటూ తీవ్ర‌మైన విమ‌ర్శ‌లు గుప్పించటం పెద్ద వివాదమైంది. బాలీవుడ్ లో ఈమ‌ధ్య తార‌లు బ‌ల‌వ‌న్మ‌ర‌ణాల‌కు పాల్ప‌డుతున్న విషయంలో ఆమె ఇలా మాట్లాడింది. అలా వాళ్ల‌ని సూసైడ్ కు పురిగొల్పేవాళ్ల‌లో జావెద్ ఒక‌డ‌ని ఓ ఇంట‌ర్వ్యూలో పేర్కొంది కంగ‌నా. దీనిపై జావెద్ లాయ‌ర్ కోర్టు కెక్కాడు. 

ఈ నేపధ్యంలో జావెద్‍ అఖ్తర్‍ కొన్ని నెలల క్రితం కంగనపై పరువునష్టం దావా వేశారు. గత నెల 1న ఈ కేసును అంధేరిలోని మెట్రోపాలిటన్‍ మేజిస్ట్రేట్‍ కోర్టు విచారించింది. మార్చి 1వ తేదీలోగా తమ ముందు హాజరు కావాలంటూ కంగనను కోర్టు ఆదేశించింది. ఈ రోజుతో కోర్టు ఇచ్చిన గడువు ముగిసింది. అయినప్పటికీ కోర్టుకు కంగన హాజరు కాలేదు. ఈ చర్యను కోర్టు ధిక్కరణగా భావించిన న్యాయస్థానం కంగనకు బెయిలబుల్‍ అరెస్ట్ వారెంట్‍ జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 26కు వాయిదా వేసింది. 

మరోవైపు కంగనకు అరెస్ట్ వారెంట్‍ జారీ కావడంపై ఆమె లాయర్‍ రిజ్వాన్‍ సిద్ధికి మాట్లాడుతూ కోర్టు ఇచ్చిన ఆదేశాలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని అన్నారు. మెట్రోపాలిటన్‍ మేజిస్ట్రేట్‍ ఆదేశాలను బాంబే హైకోర్టులో సవాలు చేస్తామని చెప్పారు. ఇదే సమయంలో జావెద్‍ అఖ్తర్‍ తరపు లాయర్‍ స్పందిస్తూ పై కోర్టుకు వెళ్లినప్పటికీ కోర్టు ముందు హాజరు కావడం నుంచి కంగన తప్పించుకోలేరని అన్నారు. దీన్ని హైకోర్టులో అప్పీల్ చేస్తామ‌ని కంగ‌నా త‌ర‌పున న్యాయ‌వాది చెబుతున్నాడు.