Asianet News TeluguAsianet News Telugu

బిగ్ బాస్ హౌజ్ నుంచి ముమైత్ ఔట్..కానీ కాదు, అర్చనను ఉప్పుగల్లు ఎక్కిన ధనరాజ్

  • బిగ్ బాస్ హౌజ్ లో 5వ వారం వీకెండ్ ఎలిమినేషన్ రద్దు
  • ఫైనల్ ఎలిమినేషన్ కు నామినేట్ అయిన ముమైత్
  • ఎలిమినేట్ అయ్యాక బిగ్ బాస్ ఆదేశంతో తిరిగి బిగ్ బాస్ హౌజ్ లో ముమైత్
  • ఇక బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో.. అర్చనను ఉప్పుగల్లు ఎక్కి రెండు రౌండ్స్ వేసిన ధనరాజ్
mumaith khan safe in big boss house

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌ గా ప్రసారం అవుతున్న 'బిగ్ బాస్' రియాల్టీ షోలో ఈ వారం మొత్తం నలుగురు సభ్యులు ఎలిమినేషన్‌కు నామినేట్ కాగా... అందులో నుండి ధనరాజ్, హరితేజ సేఫ్ అయ్యారు. చివరకు మిగిలిన ముమైత్ ఖాన్, అర్చనలో ఎవరు ఎలిమినేట్ అవుతారా అని ఆదివారం షో కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూశారు.

ఆదివారం షోలో... బాస్ హౌజ్ లో ఒక్కొక్కరినీ బోనులో ఎక్కించి.. వారిపై విమర్శలు చేయించి లోపాలను ఎత్తి చూపించారు. అలా అందర్నీ బిగ్ బాస్ బోనులో ఎక్కించారు. హౌజ్ మేట్స్ కు ఆసక్తికర టాస్క్స్ ఇచ్చిన బిగ్ బాస్ నవదీప్ ను కాసేపు ఆటపట్టించారు.

ఇక అర్చనకు ఇచ్చిన టాస్క్ లో ధన రాజ్ ను ఎక్కించుకుని రెండు రౌండ్ లు వేయాల్సి రావటంతో అర్చన అంత పనీ చేసింది. ఈ సందర్భంలో ఎన్టీఆర్ ధనరాజ్ తో .. బాగుందా అంటూ అరుస్తున్నా.. అవేమీ పట్టించుకోలేదు అర్చనపై ఉప్పు గల్లు ఎక్కి ఎంజాయ్ చేశాడు ధనరాజ్.

ఇక  ఒక్కొక్కరిని బోనులో నిలబెట్టిన ఆదివారం షోలో... నవదీప్ హౌజ్ మేట్స్ కు ఇచ్చిన ర్యాంకింగ్స్ తో... అతనికే వేషం కట్టారు. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో భాగంగా.. సభ్యులంతా నవదీప్ ను అలంకరించారు. తొమ్మిదో ర్యాంక్ లో వున్న అర్చన తోక కట్టగా, ర్యాంక్- 8లో వున్న దీక్ష బొట్టు పెట్టింది. ర్యాంక్ 7లో వున్న ముమైత్- గగుల్స్ అలంకరించింది. ర్యాంక్ 6లో వున్న హరితేజ సూపర్ మేన్ చెడ్డీ తొడగ్గా.. ర్యాంకు 5లో వున్న కత్తి కార్తిక- పూల దండ వేసింది. ఇక 4వ ర్యాంకు పొందిన ధన్ రాజ్ నవదీప్ కు మీసాలు అళంకరించాడు. 3వ ర్యాంకర్ ఆదర్శ్ చిడతలు ఇచ్చాడు. 2వ ర్యాంకులో వున్న ప్రిన్స్ గద అం.దించగా.. ఫస్ట్ ర్యాంకర్ బాలాజీ నవదీప్ కు టోపీ పెట్టాడు.

ఆ తర్వాత బ్రేక్ తీసుకున్న బిగ్ బాస్.. తిరిగొచ్చాక.. అర్చన సేఫ్ జోన్ లో వుందని ప్రకటించేశాడు. దాంతో ముమైత్ హౌజ్ లోంచి ఎలిమినేట్ అయిందని కన్ఫమ్ చేశారు. ముమైత్ ఐదు నిమిషాల్లో బ్యాగ్ ప్యాక్ చేసుకుని రావాలన్నారు. ముమైత్ కూడా అంతా ప్యాక్ చేసుకుని బయటికి వచ్చేసింది. ఈ సందర్భంగా బిగ్ బాంబ్ అవకాశాన్ని వినియోగించుకున్న ముమైత్ ఆ బాంబ్ శివ బాలాజీపై విసిరింది. బాలాజీ మాట్లాడే ప్రతి మాటకు ముందు.. ఐదు సార్లు ముమ్ము ముమ్ము ముమ్ము ముమ్ము ముమ్ము అనే వాక్యాన్ని చెప్పి మాట మొదలు పెట్టాలి. అందుకు శివబాలాజీ కూడా ఓకే చెప్పాడు.

ఇక ఈ సందర్భంగా ముమైత్ మాట్లాడుతూ.. ధన్ రాజ్ గెలుస్తాడు- ధన్ రాజ్, బాలాజీలకు ఆ ఛాన్స్ వుందని అంది. ఇక దీక్ష హౌజ్ లో పనికిరాదు అంటూ ముమైత్ చెప్పడం, ముమైత్ వెళ్లిపోవడంతో దీక్ష ఏడవడం జరిగిపోయింది. అయితే ఇఖ ముమైత్ బిగ్ బాస్ హౌజ్ నుంచి వెళ్లిపోయినట్లే అనుకుంటున్న సమయంలో... వెనక్కి పిలిచిన బిగ్ బాస్ సర్ ప్రైజింగ్ గా ముమైత్ ఖాన్ కు కేవలం ఇంటర్వల్ బ్యాంగ్ మాత్రమే వేశారు. ముమైత్ తనను తాను మాత్రమే నామినేట్ చేసుకున్నందున, బిగ్ బాస్ ఫెయిర్ గా వుండాలి కాబట్టి, చివరకు ప్రేక్షకులు కూడా ముమైత్ కు మద్దతిచ్చినందున... తిరిగి హౌజ్ లో కొనసాగించేందుకు బిగ్ బాస్ నిర్ణయించారు. దాంతో డాన్స్ వేస్తూ మరి తిరిగి హౌజ్ లోకి వెళ్లింది ముమైత్. ఈ సందర్భంగా జనాన్ని అప్సెట్ చేయకుండా, మరింత ఫెయిర్ గా గేమ్  ఆడతానని ముమైత్  చెప్పి తిరిగి హౌజ్ లోకి వెళ్లింది. అలా ఈ వారం ఎలిమినేషన్ రౌండ్ లో ఎవరూ ఎలిమినేట్ కాకుండానే షో ముగిసింది.

Follow Us:
Download App:
  • android
  • ios