Asianet News TeluguAsianet News Telugu

#DisneyIndia:అంబాని చేతికి 'డిస్నీ ఇండియా' , ఎన్ని వందల కోట్లు పెట్టారంటే... డీల్ డిటేల్స్!

భారతీయ స్ట్రీమింగ్ , మీడియా చరిత్రలో అతిపెద్ద డీల్ ఇదే అని చెప్పాలి.

Mukesh Ambani Acquires Major Stake in Disney for $1.5 Billion jsp
Author
First Published Feb 28, 2024, 8:59 AM IST


చాలా  కాలంగా వార్తల్లో ఉంటూ వస్తున్న డిస్నీ అమ్మకం వార్తలు నిజమయ్యాయి.జియో నెట్‌వర్క్‌కు యజమాని ముఖేష్ అంబానీ ఇప్పుడు OTT దిగ్గజం డిస్నీ వాటాలను కొనుగోలు చేయడం ద్వారా తన OTT నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు నిర్ణయం తీసుకున్నారు. చాలా కాలంగా చర్చలు జరుగుతుండగా, ఇన్నాళ్లకు డీల్ ఖరారైందని తెలుస్తోంది. రిలయన్స్ 61% వాటాలను కొనుగోలు చేసింది, మిగిలిన 39% వాటాను డిస్నీ కలిగి ఉంటుంది. 

ఈ మేరకు రిలయన్స్ 1.5 బిలియన్ డాలర్లను పెట్టుబడి పెట్టనుంది.  అంటే మనదేశ రూపాయలలో దాదాపు 12,400 కోట్లకు సమానం. ఈ ఎగ్రిమెంట్  ఇరువురు వాటాదారులకు లాభం కలిగేలా డీల్ కుదుర్చుకున్నారట. రిలయన్స్ గ్రూప్‌తో పాటు డిస్నీ రెండూ ఈ డీల్‌తో భారీగా లాభపడనున్నాయి. మరికొద్ది రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. డిస్నీ , రిలయన్స్ భారతదేశంలో తమ మీడియా కార్యకలాపాలను విలీనం చేయడానికి బైండింగ్ ఒప్పందంపై సంతకం చేశాయి.  ఈ డీల్ నిజమే అయితే… భారతీయ స్ట్రీమింగ్ , మీడియా చరిత్రలో అతిపెద్ద డీల్ అని చెప్పాలి.

ప్రముఖ అమెరికన్ ఎంటర్‌టైన్‌మెంట్ కంపెనీ వాల్ట్ డిస్నీ తన వ్యాపారాన్ని భారతదేశంలో అమ్మాలని చూస్తున్నట్లు చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. టెలివిజన్‌తో సహా మొత్తం డిజిటల్ స్ట్రీమింగ్ వ్యాపారాన్ని అమ్మడానికి అనేక మంది  కొనుగోలుదారులు చర్చలు జరుపుతున్నారని గతంలో బ్లూమ్‌బెర్గ్ న్యూస్ నివేదించింది. అలాగే భారతదేశంలో డిజిటల్ స్ట్రీమింగ్ రంగంలోకి ప్రవేశించిన ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ కూడా డిస్నీ ఇండియాను కొనుగోలు చేసే రేసులో ఉన్నట్లు సంబంధిత వర్గాలు చెప్పాయి. సరైన కొనుగోలుదారు దొరికితే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మరియు స్పోర్ట్స్ హక్కులను ఒకేసారి విక్రయించాలని వాల్ట్ డిస్నీ భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.  

దానికి తోడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్‌కు సంబంధించిన స్ట్రీమింగ్ హక్కులను ఇప్పటికే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కోల్పోయిన సంగతి తెలిసిందే. రిలయన్స్‌కు చెందిన వయాకామ్ 18 హక్కులను సొంతం చేసుకుంది. జియో టీవీ ద్వారా ఐపీఎల్ ఫ్రీ స్ట్రీమింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అప్పటి నుండి డిస్నీ హాట్ స్టార్ సబ్‌స్క్రైబర్లు తగ్గుతూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే భారత్‌లో తమ వ్యాపారాన్ని పూర్తిగా విక్రయించడం లేదా జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేయడం వంటి ఎంపికలను వారు పరిశీలిస్తున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఇప్పుడు అవే నిజమయ్యాయి. ఈ సమయంలో డిస్నీ ఇండియాను రిలయన్స్ సొంతం చేసుకోవటంతో ఈ రంగంలో కూడా అగ్రగామిగా నిలిచే అవకాశం ఉంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios