`మడ్డీ` మూవీకి ఆడియెన్స్ నుంచి మంచి స్పందన వస్తోన్న నేపథ్యంలో చిత్ర బృందం తమ ఆనందాన్ని షేర్‌ చేసుకుంది. సినిమాకి వస్తోన్న ఆదరణని పంచుకుంది. మేకర్స్ మాట్లాడుతూ, రేసింగ్‌, వాహనదారులను ఈ సినిమా బాగా ఆకట్టుకుంటుందన్నారు. 

యువన్‌ కృష్ణ, రిధాన్‌ కృష్ణ, రెంజిపణికర్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం `మడ్డీ`(Muddy). డాక్టర్‌ ప్రగభల్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం డిసెంబర్‌ 10న విడుదలైంది. తెలుగుతోపాటు సౌత్‌ భాషలైన తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, ఇంగ్లీష్‌ బాషల్లో విడుదలైన ఈ సినిమాకి మంచి స్పందన లభిస్తుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం తమ ఆనందాన్ని షేర్‌ చేసుకుంది. సినిమాకి వస్తోన్న ఆదరణని పంచుకుంది. మేకర్స్ మాట్లాడుతూ, రేసింగ్‌, వాహనదారులను ఈ సినిమా బాగా ఆకట్టుకుంటుందన్నారు. 

ఇంకా చెబుతూ, ``Muddy Movie పూర్తి యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రం. యాక్షన్‌తో కూడిన డ్రామా ఎలిమెంట్స్ ఆడియెన్స్ ని ఆకట్టుకుంటున్నాయి. సినిమాలో రేసింగ్‌ సన్నివేశాలు, దాన్ని మరింతగా హైలైట్‌ చేసే బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ ప్రత్యేకంగా నిలుస్తుంది. కాలేజ్‌లో జరిగే మట్టి రేసుతో సినిమా ప్రారంభమవుతుంది. అక్కడ గట్టి పోటీ నడుమ జరిగే రేసింగ్‌లో కార్తీ టోనీ విజయం సాధిస్తాడు. మొదటి సన్నివేశమే ఆడియెన్స్ ని కథలోకి తీసుకెళ్తుంది. సినిమాలోని మెయిన్‌ ఎలిమెంట్‌, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్‌, బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ ఇలా అన్ని అంశాలు ఆడియెన్స్ ని ఎంగేజ్‌ చేస్తున్నాయి. కట్టిపడేస్తున్నాయి. పైగా కథలో వచ్చే అనేక ట్విస్టులు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. 

సినిమా ప్రధానంగా స్పీడ్‌, అడ్డంకులు, మట్టి రేసింగ్‌ మైదానాలపై, అందులో ఉందే ప్రధాన పాత్రలైన కార్తీ, ముత్తుల పాత్రలు చుట్టూ కథ సాగుతుంది. ఫస్టాఫ్‌ సినిమా ఫ్లాట్‌ని తెలియజేస్తుంది. సెకండాఫ్‌లో మరిన్ని యాక్షన్‌ ఎపిసోడ్స్ ఉంటాయి. యాక్షన్‌ ప్యాక్డ్ అంశాలతోపాటు అనేక ట్విస్టులతో సాగుతుంది. రేసింగ్‌కి సంబంధించిన వ్యక్తుల జీవితాలను, అందులోని భయంకరమైన వాస్తవాలకు అద్దం పడుతుందీ సినిమా. ముత్తుకి కార్తీకి ఎలాంటి సంబంధం ఉంది. వారు ఎలా ప్రత్యర్థులుగా మారారనేది సినిమా కథగా చెప్పొచ్చు. 

రేసింగ్‌లో ఉన్న కార్తీలా కాకుండా, ముత్తు తన గరుడన్‌ అనే జీప్‌ని స్నేహితుడిగా భావిస్తుంటాడు. అదే జీవితంగా భావిస్తాడు. గరుడన్‌ జీప్‌ కూడా ఓ పాత్ర లాగా సినిమా అంతటా ఉంటుంది. దర్శకుడు డాక్టర్‌ ప్రగభల్‌ ఇలాంటి క్లిష్టమైన స్టోరీని చాలా బాగా తెరపై ఆవిష్కరించారు. ఆయన దర్శకుడిగా సక్సెస్‌ అయ్యాడని చెప్పొచ్చు. మడ్‌ రేసింగ్‌ సన్నివేశాలు, సినిమా అంతటా, ముఖ్యంగా చివరి భాగంలో అద్భుతంగా తెరకెక్కించారు. కె. జి రతీష్‌ సినిమాటోగ్రఫీ, శాన్‌ లోకేష్‌ ఎడిటింగ్‌ సినిమాకి పెద్ద అసెట్‌. 4x4 రేసింగ్‌ ఆడియెన్స్ లో జోష్‌ని నింపుతుంది. `కేజీఎఫ్‌` ఫేమ్‌ రవి బస్రూర్‌ అందించిన సంగీతం, బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ రేసింగ్‌ సన్నివేశాలను మరింత హైలైట్‌ చేశాయి. 

యాక్షన్‌ డైరెక్టర్‌ రన్‌ రవి కంపోజ్‌ చేసిన యాక్షన్‌ సీక్వెన్స్ సినిమాకి మరో హైలైట్‌. ఫైట్ సీక్వెన్స్ ని రియల్‌గా, ఎలాంటి డూప్‌ లేకుండా చిత్రీకరించాం. ఈ విషయంలో నటీనటులను అభినందించాల్సిందే. యువన్‌ కృష్ణ, రిధాన్‌ కృష్ణ, రెంజిపణికర్‌తోపాటు సురేష్‌ అనూష, ఐఎం విజయన్‌, హరీష్‌ పేరడి, సునీల్‌ సుఖదా, అమిత్‌ నాయర్‌ ప్రధాన పాత్రల్లో బాగా చేశారు. మడ్‌ రేసింగ్‌ని ఇష్టపడే వారికి, రేసింగ్‌ని ఇష్టపడే వారిని సినిమా ఆద్యంతం అలరిస్తుంది. ఆడియెన్స్ కి ఈ చిత్రం ఓ కొత్తరకమైన అనుభూతినిస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు` అని తెలిపింది యూనిట్‌. 

also read: Pushpa: సమంత ఐటమ్ సాంగ్ పై దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు.. పాట మొత్తం బూతులు