Asianet News TeluguAsianet News Telugu

భారతదేశపు తొలి మడ్ రేస్ మూవీ: 'మడ్డీ' మోషన్ పోస్టర్ రివ్యూ

భారతదేశపు మొట్టమొదటి ఆఫ్-రోడ్ మడ్ రేస్ చిత్రం ''మడ్డీ''. డాక్టర్ ప్రగభల్ ఈ వినూత్నమైన సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు

Muddy motion poster released ksp
Author
Hyderabad, First Published Feb 20, 2021, 10:03 PM IST

భారతదేశపు మొట్టమొదటి ఆఫ్-రోడ్ మడ్ రేస్ చిత్రం ''మడ్డీ''. డాక్టర్ ప్రగభల్ ఈ వినూత్నమైన సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. పికె7 క్రియేషన్స్ పతాకంపై ప్రేమ కృష్ణదాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యువన్ - రిదాన్ కృష్ణ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు.

ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్ లో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రూపొందిస్తున్నారు. 4x4 మడ్ రేసింగ్ అనేది ఆఫ్-రోడ్ మోటర్ స్పోర్ట్ లో ఒక భాగం. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశకు చేరుకున్న 'మడ్డీ' చిత్రానికి సంబంధించిన టైటిల్ లోగో , ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ని 'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి శనివారం రిలీజ్ చేశారు.

'మడ్డీ' మోషన్ పోస్టర్ చూస్తుంటే బురదలో సాగే రేసింగ్ తో సాహసోపేతమైన యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రం రూపొందుతోందని తెలుస్తోంది. రెండు వేర్వేరు జట్ల మధ్య శత్రుత్వం ప్రతీకారం, ఫ్యామిలీ డ్రామా, హాస్యం, సాహసం ఇలా ప్రతి ఎమోషన్ ను ఈ మూవీలో చూపించబోతున్నారు. మడ్ రేసింగ్‌లోని మూడు వేర్వేరు రకాలను ఇందులో తెరకెక్కించారు.

దీనితో పాటు ప్రపంచంలోని డేంజరస్ స్పాట్‌లలో చిత్రీకరణ జరుపుతున్నారు. కొద్దిమందికి మాత్రమే తెలిసిన ఆఫ్-రోడ్ రేసింగ్ క్రీడల గురించి సినిమా పరంగా ఎంతో రీసెర్చ్ చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రేసింగ్ పట్ల ఉన్న ప్రేమతో డైరెక్టర్ ఐదేళ్ల పాటు పరిశోధన చేసాడని తెలుస్తోంది.

ఈ చిత్రానికి 'కేజీఎఫ్' ఫేమ్ రవి బస్రూర్ స్వరాలు సమకూరుస్తున్నారు. హాలీవుడ్ ఫేమ్ కె.జి రతీష్  సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. శాన్ లోకేష్ ఎడిటింగ్ భాద్యతలు నిర్వహిస్తున్నారు. 2021లో ఈ పాన్ ఇండియా మూవీ విడుదల కానుంది.

 

 

Follow Us:
Download App:
  • android
  • ios