ఎంఎస్‌ రాజు ‘7 డేస్‌ 6 నైట్స్‌’తో క్రితం సంవత్సరం పలకరించారు.  సినిమాల ఫలితంతో సంభంధం లేకుండా ఆయన దుూసుకుపోతున్నారు. తాజాగా దర్శకుడిగా తన తదుపరి చిత్రాన్ని ప్రకటించారు.  

‘శత్రువు’,‘దేవి’, ‘మనసంతా నువ్వే’, ‘ఒక్కడు’, ‘వర్షం’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ వంటి సక్సెస్ ఫుల్ చిత్రాలను నిర్మించిన ఎంఎస్‌ రాజు దర్శకునిగా మారిన సంగతి తెలిసిందే. ‘డర్టీ హరి’తో దర్శకుడిగా పరిచయం అయిన ఎంఎస్‌ రాజు ‘7 డేస్‌ 6 నైట్స్‌’తో క్రితం సంవత్సరం పలకరించారు. సినిమాల ఫలితంతో సంభంధం లేకుండా ఆయన దుూసుకుపోతున్నారు. తాజాగా దర్శకుడిగా తన తదుపరి చిత్రాన్ని ప్రకటించారు. సుమంత్‌ ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌ సమర్పణలో వైల్డ్‌ హనీ ప్రొడక్షన్‌ పతాకంపై ‘సతి’ టైటిల్ తో ఈ చిత్రం తెరకెక్కనుంది. వింటేజ్‌ పిక్చర్స్, ఏబీజీ క్రియేషన్స్‌ వారు ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వాములు.

Scroll to load tweet…

తాజాగా ఆయన సోషల్ మీడియాలో ఈ విషయాన్ని ప్రకటిస్తూ ప్రీ లుక్ ని వదిలారు. ప్రీ లుక్ ఇంట్రస్టింగ్ గా ఉంది. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని మే 10, 2022 న 11:11 నిముషాలకు రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. 

సుమంత్‌ ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌ సమర్ప ణలో ఎంఎస్‌ రాజు దర్శకత్వంలో సుమంత్‌ అశ్విన్‌ నిర్మింస్తున్న ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. ‘‘నిర్మాణం– దర్శకత్వం ఏదయినా నాన్నగారు ఎంతో పట్టుదలతో, ఇష్టంతో చేస్తారు’’ అన్నారు సుమంత్‌ అశ్విన్‌.

ఎం.ఎస్.రాజు..ప్రముఖ నిర్మాణ సంస్థ సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ ని స్థాపించి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు నిర్మించారు. విక్టరీ వెంకటేశ్‌తో శత్రువు ఆయన నిర్మించిన మొదటి సినిమా. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ సాధించింది. ఆ తర్వాత పోలీస్ లాకప్, స్ట్రీట్ ఫైటర్ సినిమాలు నిర్మించారు. అయితే దేవి ఆయన కి భారీ హిట్ ఇచ్చింది. శత చిత్రాల దర్శకుడు కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా నిర్మాణ సంస్థ పేరు ప్రతిష్టలను రెట్టింపు చేసింది.

భారీ హిట్ సాధించిన ఈ సినిమాతో ఎం.ఎస్.రాజు ఇండస్ట్రీలో అగ్ర నిర్మాతగా మారారు. ఆ తర్వాత ఆయన చేసిన చిత్రాలు ఆశించిన రిజల్ట్ ని దక్కించుకోలేకపోయాయి. దీంతో దర్శకుడిగా మారాడు. `వాన`, `తూనీగ తూనీగ` సినిమాలు తెరకెక్కించారు. దర్శకుడిగా సరైన గుర్తింపు కోసం కొంత గ్యాప్‌ తీసుకుని `డర్టీ హరి` తీశారు. ఇది ఫర్వాలేదనిపించింది. ఇప్పుడు మరోసారి దర్శకుడిగా తన సత్తా చాటేందుకు వస్తున్నారు.