దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్'లో సర్కారు వారి పాట సర్ప్రైజ్.. పరశురామ్ కి కీర్తి సురేష్ డ్రెస్ అంత నచ్చిందా ?
ఖుషి తర్వాత రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న చిత్రాలలో పరశురామ్ దర్శకత్వంలోని మూవీ ఒకటి. రీసెంట్ గా ఈ చిత్ర టైటిల్ ప్రకటిస్తూ ఫస్ట్ లుక్ టీజర్ కూడా రిలీజ్ చేశారు.

ఖుషి తర్వాత రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న చిత్రాలలో పరశురామ్ దర్శకత్వంలోని మూవీ ఒకటి. రీసెంట్ గా ఈ చిత్ర టైటిల్ ప్రకటిస్తూ ఫస్ట్ లుక్ టీజర్ కూడా రిలీజ్ చేశారు. విజయ్ దేవరకొండని యాక్షన్ మోడ్ లో చూపిస్తూ పరశురామ్ మరో ఫ్యామిలీ డ్రామా తెరక్కిస్తున్నట్లు అర్థం అవుతోంది.
కుటుంబంలో ప్రశాంతమైన జీవితం గడుపుతున్న వ్యక్తి సెటిల్మెంట్స్ కి దిగితే ఎలా ఉంటుందో అని విజయ్ దేవరకొండ రూపంలో పరశురామ్ ఈ చిత్రంలో చూపిస్తున్నాడు. విజయ్ దేవకొండ కామన్ మాన్ తరహాలో ఈ చిత్రంలో కనిపిస్తున్నాడు.
పరశురామ్ చిత్రాలు అంటే హీరోయిన్లకు పెద్ద పీట ఉంటుంది. హీరోయిన్ పాత్రని పరశురామ్ చాలా ప్రత్యేకంగా చూపిస్తారు. ఫ్యామిలీ స్టార్ టీజర్ లో హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ని చూపించింది కేవలం కొద్ది క్షణాలు మాత్రమే. కనిపించింది. కానీ ఆమె గురించే ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ సాగుతోంది.
మృణాల్ ఠాకూర్ డ్రెస్ గురించే అంతా చర్చించుకుంటున్నారు. ఎందుకంటే మృణాల్ ఠాకూర్ టీజర్ లో వేసుకున్న డ్రెస్ తో పరశురామ్.. సర్కారు వారి పాట చిత్రానికి లింక్ పెట్టాడు. ఇది యాదృచ్చికంగా జరిగిందా లేదా అటెన్షన్ కోసం పరశురామ్ కావాలనే ఈ నిర్ణయం తీసుకున్నాడా అనేది తెలియదు.
ఫ్యామిలీ స్టార్ టీజర్ లో మృణాల్ ఠాకూర్ వేసుకున్న డ్రెస్.. సర్కారు వారి పాట చిత్రంలో ఒక సంధర్భంలో కీర్తి సురేష్ వేసుకున్న డ్రెస్ ఒకేలా ఉన్నాయి. ఏంటి పరశురామ్ కి కీర్తి సురేష్ డ్రెస్ అంత బాగా నచ్చిందా అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. మృణాల్ ఠాకూర్ కి కూడా కీర్తి సురేష్ డ్రెస్ నే ఎందుకు ఉపయోగించారు అంటూ కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు.
ఒక హీరోయిన్ మరో హీరోయిన్ కాస్ట్యూమ్స్ వేసుకోవడం చాలా రేర్.. చీరల్లో మాత్రమే కాస్త పోలిక ఉంటుంది. డ్రెస్ లు ఒకేలా ఉండడం అసలు జరగదు. కానీ మృణాల్ ఠాకూర్ డ్రెస్.. సర్కారు వారి పాట చిత్రంలో కీర్తి ధరించిన డ్రెస్ లాగే ఉండడంతో ఈ చర్చ మొత్తం జరుగుతోంది.