మ్యూజికల్‌ మ్యాస్ట్రో ఇళయరాజా నేడు హైదరాబాద్‌ మ్యూజికల్‌ కాన్సర్ట్ నిర్వహించనున్న విషయం తెలిసిందే. శనివారం ఆయనకు ట్రూబ్యూట్‌ టూ ఇళయరాజా పేరుతో ఏర్పాటు చేసిన సభ గ్రాండ్‌గా జరిగింది.

మ్యూజిక్‌ మ్యాస్ట్రో ఇళయరాజా నేడు(ఆదివారం) హైదరాబాద్‌లో మ్యూజిక్‌ కాన్సర్ట్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్బంగా ముందస్తుగా శనివారం సాయంత్రం `ట్రి బ్యూట్‌ టూ ఇళయరాజా` పేరుతో మ్యూజికల్‌ ఈవెంట్‌ని నిర్వహించారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో ఈ రెడ్‌ కార్పెట్‌ ఈవెంట్‌ జరిగింది. ఎన్నో విజయవంతమైన ఈవెంట్స్ చేసిన హైదరాబాద్ టాకీస్ వారి ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ఈవెంట్ జరిగింది.

ఇళయరాజ సంగీత దర్శకత్వం వహించిన సినిమాలలోని అలనాటి మధురమైన పాటలను ఆయన ముందే గాయనీ గాయకులు ఆలపించారు. శ్రోతలను ఉర్రూతలూగించారు. బ్యాక్‌ టూ బ్యాక్‌ సంగీత గానంతో అలరించారు. అందరిని ఒక్కసారిగా వెనక్కి తీసుకెళ్లారు. కంటిన్యూగా నాలుగు గంటలపాటు మ్యూజిక్‌ షో అద్యంతం అలరించింది. ఇందులో తెలుగు సినీరంగ ప్రముఖులు సంగీత దర్శకుడు ఇళయరాజాకు సన్మానం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం వేదపండితుల ఆశీర్వచనాలతో సత్కరించారు. ప్రముఖ దర్శకులు, నిర్మాతలు, సంగీత దర్శకులు, గాయనీగాయకులు ఇళయరాజాను శాలువాతో సన్మానించారు. 

ఈ కార్యక్రమంలో దిగ్గజ రైటర్‌, ఎంపీ విజయేంద్ర ప్రసాద్‌ పాల్గొన్నారు. వారితోపాటు దర్శకుడు కోదండరామిరెడ్డి, నిర్మాత అశ్వినిదత్, సంగీత దర్శకులు మణిశర్మ, ఆర్.పీ.పట్నాయక్, పాటల రచయిత హరిరామజోగయ్య శాస్త్రి, నిర్మాత సీ.కళ్యాణ్, నటుడు మురళీమోహన్, `సీతారామం` ఫేమ్‌ మృణాల్ ఠాకూర్, గాయని సునీత, నటుడు రఘుబాబులు.. వంటి వారు ఇళయరాజాను సన్మానించారు. ఇళయరాజ 80ఏళ్లలోకి అడుగుపెడుతున్న సందర్బంగా 80 ఏళ్ల లోగోను ప్రముఖ రచయితా విజయేంద్రప్రసాద్ రిమోట్ తో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రముఖులు మాట్లాడుతూ ఇళయరాజా సంగీతాన్ని, ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఇదిలా ఉంటే ఈ రోజు ఇళయరాజా తన మ్యూజికల్‌ కాన్సర్ట్ ని గ్రాండ్‌గా నిర్వహించనున్నారు.