అఖిల్ - హలో ఫెయిల్యూర్స్ తరువాత వెంకీ అట్లూరి డైరెక్షన్ లో అఖిల్ చేసిన చిత్రం మిస్టర్ మజ్ను. అఖిల్ ఆశలు పెట్టుకున్న సినిమా నేడు ఫైనల్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే సినిమా ప్రీమియర్స్ ను ఇతర దేశాల్లో ముందు ప్రదర్శించగా సినిమా మొదటి టాక్ ఏంటో తెలిసిపోయింది. ఈ సారి అఖిల్ హిట్టు కొట్టేలా ఉన్నాడని టాక్ వస్తోంది.

విదేశాల్లో ఉండే నిక్కీ (నిధి అగర్వాల్) -  విక్కీ (అఖిల్) ఇండియాకు వచ్చి ఒక ఫ్యామిలీ వెడ్డింగ్ తో కలుసుకుంటారు. రాముడు లాంటి భర్త కావాలని నిక్కీ కోరుకుంటుంది. మొదట దర్శకుడు అఖిల్ పాత్రను డిజైన్ చేసిన విధానం బావుంది. ఇక నిక్కీ తో ట్రావెలింగ్ అనంతరం మ్యారేజ్ సీన్స్ ఫ్యామిలీ ఆడియెన్స్ కి కూడా బాగానే కనెక్ట్ అవుతాయి. అఖిల్ చిలిపి తనాన్ని చూపిస్తూనే ఎమోషనల్ సీన్స్ ను కరెక్ట్ గా ఎలివేట్ చేసినట్లు అనిపిస్తుంది.

ఇక ఇంటర్వెల్ కి వచ్చేసరికి విక్కీ పాత్రలో మార్పు సెకండ్ హాఫ్ పై ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ప్లే బాయ్ లా ఉండే విక్కీ క్యారెక్టర్ లో మరొషేడ్ దర్శకుడు ఆకట్టుకునే విధంగా చిత్రీకరించాడు. ఫ్యామిలీ సీన్స్ తో పాటు కామెడీ ఎంటర్టైన్మెంట్ సీన్స్ ని కూడా యాడ్ చేసి ఫైనల్ గా డైరెక్టర్ గుడ్ ఫిల్మ్ ను ఇచ్చాడని చెప్పవచ్చు. లవ్ స్టోరీ అక్కడక్కడా కొంచెం రొటీన్ గానే అనిపిస్తోంది. సెకండ్ హాఫ్ స్లోగా అనిపించినప్పటికి హీరోయిన్ సీన్స్ సినిమాని ఒక్కసారిగా లిఫ్ట్ చేస్తాయి.

అయితే మ్యూజిక్ విషయంలో మాత్రం థమన్ ఈసారి అంతగా మెప్పించలేకపోయాడు. తొలిప్రేమ లాంటి మ్యూజిక్ ని ఆడియేన్స్ ఉహించినప్పటికి ఆ స్థాయిలో అంచనాలను అందుకోలేకపోయాడు. కెమెరా పనితనం స్క్రీన్ పై కనిపిస్తుంది. ఇక అఖిల్ లుక్స్ డ్యాన్స్ తో పాటు ఫైట్స్ కూడా బావున్నాయి. ఫైనల్ గా అఖిల్ ఈ సారి హిట్టు కొట్టేలా ఉన్నాడని టాక్ వస్తోంది. మరి మన ఆడియేన్స్ ఎంతవరకు మిస్టర్ మజ్నుకి ఓటేస్తారో తెలియాలంటే మరికొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే.