రవితేజ్‌, హరీష్‌ శంకర్‌ కాంబినేషన్‌ లో `మిస్టర్ బచ్చన్‌` చిత్రం రూపొందుతుంది. అయితే తాజాగా ఈ ఇద్దరు `రైడ్‌ 2` ఓపెనింగ్స్ లో పాల్గొనడం ఆసక్తికరంగా మారింది. దీని వెనుకున్న కథేంటంటే?

మాస్‌ మహారాజా రవితేజ ముంబయిలో సందడిచేశాడు. దర్శకుడు హరీష్‌ శంకర్‌తో కలిసి ఆయన అజయ్ దేవగన్‌ సినిమా ఓపెనింగ్‌లో మెరిశారు. వీరితోపాటు నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌ కూడా ఉన్నారు. అజయ్‌ దేవగన్‌ హీరోగా రూపొందుతున్న `రైడ్ 2` సినిమా ఓపెనింగ్‌ ముంబయిలో శనివారం జరిగింది. రవితేజ చేతుల మీదుగా ఈ సినిమా ఓపెనింగ్‌ జరిగింది. ఈ మేరకు చిత్ర బృందం ఈ ఫోటోలను పంచుకుంది. అయితే ఈ సందర్బంగా అజయ్‌ దేవగన్‌.. రవితేజకి ధన్యవాదాలు తెలిపారు. ఆయన సమక్షంలో `రైడ్‌ 2` ఓపెనింగ్‌ జరగడం సంతోషంగా ఉందన్నారు. 

మరోవైపు దీనికి రవితేజ కూడా రియాక్ట్ అయ్యారు. తాను గౌరవంగా ఫీలవుతున్నానని, ఇది మెమొరబుల్‌ మూవీ కావాలని, అదే సమయంలో పెద్ద బ్లాక్‌ బస్టర్‌ కావాలని రవితేజ కోరుకుంటూ ట్వీట్‌ చేశారు. చిత్ర బృందానికి ఆయన విషెస్‌ తెలిపారు. అయితే అజయ్‌ దేవగన్‌ సినిమా ఓపెనింగ్‌కి రవితేజ, హరీష్‌ శంకర్‌ వెళ్లడానికి కారణం ఏంటనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. 

ప్రస్తుతం రవితేజ `మిస్టర్‌ బచ్చన్‌` చిత్రంలో నటిస్తున్నారు. హరీష్‌ శంకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్‌ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ ప్రారంభమైంది. ఓ షెడ్యూల్‌ని కూడా పూర్తి చేసుకుంది. అయితే ఇది అజయ్‌ దేవగన్‌ హీరోగా నటించిన `రైడ్‌` చిత్రానికి రీమేక్‌.ఐదేళ్ల క్రితం వచ్చిన ఈ చిత్రం హిందీలో పెద్ద విజయం సాధించింది. దీన్ని తెలుగులో `మిస్టర్‌ బచ్చన్‌` పేరుతో రీమేక్‌ చేస్తున్నారు రవితేజ, హరీష్‌ శంకర్‌. దీంతో దీనికి సీక్వెల్‌ `రైడ్‌ 2` బాలీవుడ్‌లో ప్రారంభం అవుతున్న నేపథ్యంలో రవితేజ, హరీష్‌ శంకర్‌లు పాల్గొన్నారు. ఇది పోలీస్‌, ఐటీ రైడ్‌ నేపథ్యంలో సాగుతుంది. ప్రభుత్వ శాఖల్లో అవకతవకలను ఆవిష్కరించేలా, కొత్త కేస్‌ నేపథ్యంలో ఈ మూవీ సాగుతుందని తెలుస్తుంది. నవంబర్‌ 15న విడుదల కాబోతుంది. 

Scroll to load tweet…