Asianet News TeluguAsianet News Telugu

ఆర్ఆర్ఆర్ మూవీలో ఎన్టీఆర్ గెటప్...రాజమౌళికి ఎంపీ బాపురావు హెచ్చరిక!

 లేదని అలానే విడుదల చేస్తే థియేటర్లను తగులబెట్టే అవకాశం ఉందని హెచ్చరించారు. కలెక్షన్ల కోసం తమ ఆరాధ్య దైవాన్ని కించ పరిస్తే సహించబోమని, నైజాంకు వ్యతిరేకంగా పోరాడిన కొమరం భీమ్‌ అమరుడయ్యారని బాపురావు తెలిపారు. భీమ్‌ని చంపిన వాళ్ల టోపీని ఆయనకు పెట్టడం ఆదివాసులను అవమానించడమేనని.. రాజమౌళి ఇప్పటికైనా చరిత్రను తెలుసుకోవాలని, లేదంటే మర్యాదగా ఉండదని ఆయన హెచ్చరించారు.

MP Warns  Rajamouli for RRR Teaser jsp
Author
Hyderabad, First Published Oct 27, 2020, 12:47 PM IST

ఆర్ ఆర్ ఆర్ సినిమా రిలీజ్ కాకుండా కేవలం టీజర్ తోనే సమస్య మొదలైంది.  తాజాగా రాజమౌళికి ఎంపీ సోయం బాపురావు వార్నింగ్ ఇచ్చారు. ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీలో భీమ్‌ పాత్రకు పెట్టిన టోపీని తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. లేదని అలానే విడుదల చేస్తే థియేటర్లను తగులబెట్టే అవకాశం ఉందని హెచ్చరించారు. కలెక్షన్ల కోసం తమ ఆరాధ్య దైవాన్ని కించ పరిస్తే సహించబోమని, నైజాంకు వ్యతిరేకంగా పోరాడిన కొమరం భీమ్‌ అమరుడయ్యారని బాపురావు తెలిపారు. భీమ్‌ని చంపిన వాళ్ల టోపీని ఆయనకు పెట్టడం ఆదివాసులను అవమానించడమేనని.. రాజమౌళి ఇప్పటికైనా చరిత్రను తెలుసుకోవాలని, లేదంటే మర్యాదగా ఉండదని ఆయన హెచ్చరించారు.

'బాహుబలి' సినిమా తర్వాత దర్శకుడు రాజమౌళి రూపొందిస్తున్న 'ఆర్ఆర్ఆర్' సినిమాలో కొమరం భీమ్‌గా నటిస్తోన్న ఎన్టీఆర్‌కు సంబంధించిన టీజర్ ను ఆ సినిమా యూనిట్ నాలుగు  రోజుల క్రితం విడుదల చేసింది.  దీని కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తోన్న విషయం తెలిసిందే. ‘వాడు కనపడితే సముద్రాలు తడబడతాయి’.. అంటూ చెర్రీ వాయిస్ తో ఉన్న ఆర్ఆర్ఆర్ ఎన్టీఆర్ భీమ్ టీజర్ అదుర్స్ అనిపిస్తోంది. ‘నా తమ్ముడు గోండు బెబ్బులి కొమురం భీం’ అంటూ చరణ్ ఈ పాత్రను పరిచయం చేశాడు. పులిలా పోరాటానికి ఎన్టీఆర్ టీజర్ లో దూసుకెళ్తున్నాడు. అయితే అదే సమయంలో ఈ టీజర్ వివాదంలో చిక్కుకుంది. 
  
  ఈ టీజర్ లో కుమ్రం భీమ్ ముస్లిం టోపీ ధరించినట్టు చూపెట్టారు. ఈ సన్నివేశం ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. కుమ్రుం భీమ్ కు టోపీ పెట్టడంపై ఆదివాసీలు తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ లోని కుమ్రుం భీమ్ ప్రాంగణంలో ఉన్న ఆయన విగ్రహానికి కుమ్రుం భీమ్ యువసేన నేతలు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిత్ర యూనిట్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

భీమ్ కు టోపీ పెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు కుమ్రుం భీమ్ అని... ఆయన చరిత్రను పూర్తిగా అర్థం చేసుకుని సినిమా తీయాలని రాజమౌళికి చెపుతున్నామని అన్నారు. ఇష్టం వచ్చినట్టు సినిమా తీస్తూ, ఆదివాసీల మనోభావాలను దెబ్బతీయవద్దని చెప్పారు. టోపీ పెట్టుకున్న సన్నివేశాలను తొలగించాలని, లేకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. 

మరో ప్రక్క తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క స్పందించారు. 'మన్యం ముద్దుబిడ్డ, మా అన్న, మా ఆదర్శం కొమురం భీమ్ జయంతి సందర్భంగా నా ఘన నివాళులు' అని ఆమె ట్వీట్ చేశారు. కొమురం భీమ్ స్ఫూర్తితో తెరకెక్కిస్తున్న ఈ చిత్ర యూనిట్ కి అభినందనలు తెలియజేస్తున్నానని చెప్పారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios