ఇటీవల జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల్లో నరేష్ ప్యానెల్ గెలిచిన సంగతి తెలిసిందే. శుక్రవారం నాడు 'మా' అధ్యక్షుడిగా నరేష్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ వేడుకకు శివాజీరాజా కూడా హాజరవడం గమనార్హం.

ఇది ఇలా ఉండగా.. ప్రమాణ స్వీకారం చేసిన తరువాత నరేష్ స్పీచ్ ఇచ్చారు. శివాజీరాజా ప్యానెల్ తో తమకు విరోధం లేదని చెప్పారు. అలానే స్పీచ్ భాగంగా ఆయన ''నా'' అనే పదాన్ని ఎక్కువ సార్లు ఉపయోగించారు. ''నా'' పెర్సనల్ అకౌంట్ నుండి లక్ష విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు.

అలానే మరికొన్ని విషయాలను చెబుతూ 'నా.. నా' అని వాడడం వైస్ ప్రెసిడెంట్ గా రాజశేఖర్ కి నచ్చలేదు. దీంతో ఆయన మైక్ తీసుకొని ''నరేష్ గారు ''నేను'' ''నేను'' అనే పదం  వాడి ఉండకూడదు'' అంటూ అసహనం వ్యక్తం చేశారు.

నరేష్ తన ఫ్రెండ్ అని, ఆయన అడుగుతున్నాడనే ఎలెక్షన్స్ లో పాల్గొని గెలిచానని.. ఆయన మాట్లాడేప్పుడు మేం అని మాట్లాడాలని నా రిక్వెస్ట్ అంటూ కౌంటర్ ఇచ్చారు. ఇదంతా గమనించిన జీవితా.. రాజశేఖర్ మరో ఉద్దేశంతో అటువంటి కామెంట్స్ చేయలేదని మేమంతా ఒక్కటే అని అన్నారు.