Asianet News TeluguAsianet News Telugu

సోనూ సూద్‌కి అరుదైన గౌరవం.. కిలిమంజారో అధిరోహకుడు తన సక్సెస్‌ అంకితం

సినిమాలో ఆయన విలన్‌ అయినా.. రియల్‌ లైఫ్‌ లో హీరో అయి `రియల్‌ హీరో`గా పాపులర్‌ అయ్యారు. ఆయనకు తాజాగా ఓ అరుదైన గౌరవం దక్కింది. ఓ సాహసీకుడు తన విజయాన్ని అందించారు.

mountaneer uma singh conquers mt kilimanjaro and dedicates his victory to sonu sood
Author
Hyderabad, First Published Aug 17, 2021, 6:34 PM IST

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంది. దాని దెబ్బకి అంతా లాక్‌డౌన్‌ అయ్యింది. వలస కార్మికులు రోడ్డున పడ్డారు. తిండి లేక, ఇంటికెళ్లేందుకు దారితెలియక నానా యాతన అనుభవించారు. అలాంటి టైమ్‌లో ఆదుకునేందుకు ఒక్కడు ముందుకొచ్చాడు. వారికి తిండి పెట్టాడు. ప్రభుత్వం వలసదారులు ఇంటికెళ్లెందుకు అనుమతివ్వడంతో దగ్గరుండి మరీ కార్మికులను సొంతూళ్లకి పంపించాడు. 

అప్పటి నుంచి ఇప్పటి వరకు తన సహాయం అందిస్తూనే ఉన్నాడు. కరోనా బాధితులకు, కరోనా రోగులకు అందగా నిలుస్తున్నారు. పేదలకు తనవంతు సాయం అందిస్తున్నారు. ఇప్పటికే ఆయనెవరో అందరికి అర్థమై ఉంటుంది. రియల్‌ హీరో సోనూ సూద్. సినిమాలో ఆయన విలన్‌ అయినా.. రియల్‌ లైఫ్‌ లో హీరో అయి `రియల్‌ హీరో`గా పాపులర్‌ అయ్యారు. ఆయనకు తాజాగా ఓ అరుదైన గౌరవం దక్కింది. ఓ సాహసీకుడు తన విజయాన్ని అందించారు. పర్వతారోహకుడు తన విజయాన్ని సోనూసూద్‌కి అంకితం ఇచ్చాడు. 

ఉత్తర ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌కి చెందిన పర్వతారోహకుడు, సైక్లిస్ట్ ఉమా సింగ్‌(25) ఇటీవల ఆఫ్రికాలోని ఎత్తైన శిఖరం కిలిమంజారోని అధిరోహించాడు. ఈ సందర్భంగా సోనూ సూద్‌ పోస్టర్‌ని తీసుకెళ్లి ఆ శిఖరంపై నుంచి ప్రదర్శించాడు. తన విజయాన్ని సోనూ సూద్‌కి అంకితమిస్తున్నట్టు ఆ మౌంటేన్‌ పైనుంచి ప్రకటించడం విశేషం. ఇప్పుడీ వీడియో వైరల్‌ అవుతుంది.

మౌంటేన్‌ కిలిమంజారో ప్రపంచంలోని అత్యంత ఎత్తైన, కష్టమైన పర్వతాల్లో ఒకటి. ఉమా సింగ్‌ ఈ పర్వతంపైన ఉన్న ఫస్ట్ బేస్‌ పాయింట్‌ వరకు ఎక్కారు. అతను తన సక్సెస్‌ని సోనూసూద్‌కి ఇవ్వడంపై స్పందించారు. `నా జీవితంలో మొదటిసారి నేను రియల్‌ హీరోని కలుసుకున్నాను. ఆయనకు ఏదైనా చేయాలనిపించింది. ఆయన తన వ్యక్తిగత జీవితంలో సంబంధం లేకుండా క్రిష్ట పరిస్థితులలో మన దేశం కోసం నిలబడ్డారు. మీరు మా దేశానికి నిజమైన హీరో సోనూ సూద్‌ సర్‌. ఆయన మన దేశంలోని అందరికి అన్నయ్య` అని తెలిపారు.

ఈ వీడియోని చూసిన సోనూసూద్‌ స్పందించారు. తన ఆనందాన్ని పంచుకున్నారు. `ఉమా గురించి నేను చాలా గర్వపడుతున్నా. అతను చాలా కష్టమైన దాన్ని సాధించడానికి ముందుకు వెళ్లాడు. అతని కృషి, దృఢ సంకల్పమే అతనికి ఈ ఘతన సాధించడానికి సహాయపడింది. అతని సంజ్ఞ, మాటలతో నేను కదిలిపోయాను. మన యూవతకి ఉమా స్ఫూర్తిగా నిలిచారు. 

ఇంత చిన్న వయసులో అలాంటి సంకల్పం మన భారతీయ యువత ఏదైనా చేయడంలో తమ హృదయాన్ని స్థిరపరుచుకుంటే అన్ని విధాలుగా దాన్ని సాధిస్తారని చూపిస్తుంది. అభినందనలు ఉమ. మీ మంచి మాటలకు ధన్యవాదాలు` అని తెలిపారు. త్వరలో ఉమా ముంబయికి వచ్చి సోనూసూద్‌ని కలుస్తా అని తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios