బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కు చేదు అనుభవం ఎదురైంది. ఊహించని విధంగా ఆమె కారుపై ఒక బండరాయి పడటం హాట్ టాపిక్ గా మారింది. కారులో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని లేకుంటే దీనికి బాద్యులు ఎవరని ఆమె అధికారులను సోషల్ మీడియా ద్వారా ప్రశ్నించింది. 

అసలు వివరాల్లోకి వెళితే.. ముంబైలోని జుహు సిగ్నల్ వద్ద కారు పార్క్ చేసి ఉండగా ఎవరు ఊహించని విధంగా 11వ అంతస్తు నుంచి ఒక రాయి పడింది. దీంతో కారు అద్దం పగిలింది. అప్పుడు కారులో ఎవరు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఈ విషయంపై మౌని రాయ్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా ద్వారా తన వివరణ ఇచ్చారు. 

'ఆ సమయంలో నేను నా డ్రైవర్ కారులో లేము. ఊహించని విధంగా 11వ అంతస్థు నుంచి రాయి పడింది. పరిసర ప్రాంతాల్లో చాలా మంది నడుచుకుంటూ వెళుతుంటారు. జరగరానిది ఏదైనా ప్రమాదం జరిగి ఉంటే దానికి ఎవరు బాద్యులు? మెట్రో పనులు ఇంత బాధ్యతరహితంగా కొనసాగుతున్నాయనడానికి ఇదే ఉదాహరణ' అని మౌని రాయ్ ఆవేదన వ్యక్తం చేశారు.