రెబెల్ స్టార్ ప్రభాస్ రాధే శ్యామ్ మూవీ విడుదల తేదీ ప్రకటించిన విషయం తెలిసిందే. జులై 30న రాధే శ్యామ్ ప్రపంచ వ్యాప్తంగా పలు భాషల్లో విడుదల కానుంది. ఐతే సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో అలియా భట్ హీరోయిన్ గా తెరకెక్కిన గంగూభాయ్ కథియావాడి మూవీ సైతం అదే రోజున విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇటీవల గంగూభాయ్ కథియావాడి టీజర్ విడుదల కాగా, మూవీ విడుదల తేదీ కూడా ప్రకటించడం జరిగింది. 

ప్రభాస్, అలియా బాక్సాఫీస్ వద్ద పోటీ పడనున్న నేపథ్యంలో బాలీవుడ్ లో దీనిపై పెద్ద చర్చ నడుస్తుంది. కొన్ని మీడియా సంస్థలు రాధే శ్యామ్, గంగూభాయ్ చిత్రాలలో మీ ఛాయిస్ ఏది అంటూ పోల్స్ నిర్వహించడం జరిగింది. అనూహ్యంగా పలు పోల్స్ నందు ప్రభాస్ కే అధిక ఓట్లు దక్కాయి. అలియా చిత్రం కంటే కూడా ప్రభాస్ మూవీ చూడడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నట్లు నెటిజెన్స్ తమ అభిప్రాయం తెలియజేశారు. 


ప్రభాస్ మేనియాతో పాటు, మెజారిటీ నెటిజెన్స్  రాధే శ్యామ్ వైపు మొగ్గు చూపడానికి మరొక కారణం అలియా పై బాలీవుడ్ లో కొనసాగుతున్న వ్యతిరేకత అన్న మాట వినిపిస్తుంది. సోషల్ మీడియా పోల్స్ లో నెటిజెన్స్ కామెంట్స్ దీనిని స్పష్టం చేస్తున్నాయి. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం బాలీవుడ్ ని షేక్ చేసింది. బాలీవుడ్ పెద్దలు, మరియు వారి వారసులు సుశాంత్ మరణానికి కారణం అంటూ అలియా, కరీనా కపూర్, సల్మాన్, మహేష్ భట్, కరణ్ జోహార్ వంటి వారిపై నెటిజెన్స్  సోషల్ మీడియా యుద్ధం చేశారు. 


మహేష్ భట్ దర్శకత్వంలో అలియా హీరోయిన్ గా నటించిన సడక్ 2 చిత్రాన్ని ఘోర పరాజయం పాలు చేశారు నెటిజెన్స్. ఆ మూవీపై విపరీతమైన నెగిటివ్ ప్రచారం చేశారు. ఆ గొడవ సద్దుమణిగినట్లు అందరూ భావిస్తున్నా... పూర్తి స్థాయిలో కాదని అనుమానం కలుగుతుంది. దీని కారణంగా బాలీవుడ్ ప్రేక్షకులు అలియా చిత్రాన్ని బహిష్కరించి.. రాధే శ్యామ్ ని వీక్షించే అవకాశం లేకపోలేదు. మరి అదే జరిగితే.. అలియా పై వ్యతిరేకత ప్రభాస్ కి ప్లస్ అవుతుంది.