Asianet News TeluguAsianet News Telugu

అఫీషియల్: ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌..‌’ రిలీజ్ డేట్ ఇచ్చేసారు

 ‘హలో’, ‘మిస్టర్‌ మజ్ను’ చిత్రాల్లో ప్రేమికుడిగా మెప్పించిన యంగ్ హీరో అక్కినేని అఖిల్‌. బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో ఆయన హీరోగా  ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ అనే టైటిల్‌ తో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.  జీఏ2 పిక్చర్స్‌ పతాకంపై బన్నీ వాస్‌, వాసు వర్మ నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే  హీరోయిన్.  శరవేగంగా షూటింగ్ జరుపుకొన్న ఈ సినిమా క్రితం సంవత్సరం వేసవి కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేసారు. అయితే కరోనా ఎఫెక్ట్ తో కుదరలేదు. దాంతో ఈ వేసవికి ఈ సినిమా రాబోతోంది. ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు. 

Most Eligible Bachelor finally announces release date jsp
Author
Hyderabad, First Published Feb 4, 2021, 7:28 AM IST

అఖిల్‌  హీరోగా నటిస్తున్న చిత్రం ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’. బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకుడు. బన్నీ వాసు, వాసు వర్మ నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే  హీరోయిన్. వేసవి కానుకగా జూన్‌ 19న ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఈ విషయాన్ని చిత్ర టీమ్ అఫీషియల్ గా ప్రకటించింది. ఈ  విడుదల తేదీతో కొత్తలుక్‌ని అభిమానులకు షేర్ చేసారు. ఈ పోస్టర్‌లో అఖిల్‌..పూజ ఒకరి కళ్లలో ఒకరు చూసుకుంటూ రొమాంటిక్‌ లుక్‌లో ఆకట్టుకునేలా కనిపించారు. 

 ఈ సినిమాను జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై నిర్మిస్తున్నారు. భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌, పిల్లా నువ్వులేని జీవితం, గీత గోవిందం, ప్ర‌తిరోజు పండ‌గే లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాలతో మోస్ట్ సక్సెస్ ఫుల్ నిర్మాతగా క్రేజ్ సొంతం చేసుకున్న‌ బన్నీ వాసు, మరో నిర్మాత ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వాసు వర్మతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అఖిల్ అక్కినేని సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్‌‌గా నటిస్తుంది. 

‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ ప్రకటించిన రోజు నుంచి కూడా ఈ సినిమాపై అక్కినేని అభిమానుల్లో ఆసక్తి మొదలైంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌ టీం విడుదల చేసిన అఖిల్ అక్కినేని ఫస్ట్ లుక్‌కు, అలానే గోపీ సుంద‌ర్ సంగీత‌ సార‌ధ్యంలో హ్యాపెనింగ్ స్టార్ సింగర్ సిద్ శ్రీరామ్ పాడిన మనసా మ‌న‌సా పాటకు, ఆ తర్వాత విడుదల చేసిన టీజ‌ర్‌కు అటు సోషల్ మీడియాలో ఇటు అభిమానుల్లో అనూహ్యమైన స్పందన లభించడం యూనిట్‌లో కొత్త ఉత్సాహ‌న్ని తెచ్చింది.

ద‌ర్శ‌కుడు బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ త‌న చిత్రాల్లోని పాత్ర‌ల్ని చాలా క్యూట్ రొమాన్స్‌తో ల‌వ్ లీగా వుండేలా డిజైన్ చేస్తారు. అందుకే ఆయ‌న చిత్రాల‌కి ఓ ప్రత్యేకత వుంటుంది. ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాలో కూడా అఖిల్ అక్కినేని, పూజాల మధ్య కూడా అలాంటి కెమిస్ట్రి ఉండేలా డిజైన్ చేసారు.

న‌టీ న‌టులు:
అఖిల్ అక్కినేని, పూజా హెగ్ఢే, ఆమ‌ని, ముర‌ళి శ‌ర్మ‌, జ‌య ప్ర‌కాశ్, ప్ర‌గ‌తి, సుడిగాలి సుధీర్, గెటెప్ శ్రీను, అభ‌య్, అమిత్ తదితరులు..

సాంకేతిక నిపుణులు:
బ్యానర్ : జీఏ2 పిక్చ‌ర్స్
స‌మ‌ర్ప‌ణ : అల్లు అర‌‌వింద్
మ్యూజిక్ : గోపీ సుంద‌ర్
సినిమాటోగ్రాఫీ : ప్ర‌దీశ్ ఎమ్ వ‌ర్మ
ఎడిట‌ర్ : మార్తండ్ కే వెంక‌టేశ్
ఆర్ట్ డైరెక్ట‌ర్ : అవినాష్ కొల్లా
నిర్మాత‌లు : బ‌న్నీ వాసు, వాసు వ‌ర్మ‌
దర్శకుడు : బొమ్మ‌రిల్లు భాస్క‌ర్
     

Follow Us:
Download App:
  • android
  • ios