టైమ్స్ మ్యాగజైన్ ఎప్పటిలానే ఈ ఏడాది కూడా  దేశవ్యాప్తంగా “మోస్ట్ డిసైరబుల్ మెన్” లిస్ట్ ని విడుదల చేసింది.  అయితే ఈ సారి బాలీవుడ్ స్టార్ హీరోలను సైతం ,వెనక్కి నెట్టేసి మన సూపర్ స్టార్ మహేష్ బాబు మొదటిస్థానాన్ని దక్కించుకున్నాడు. 

సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్, అక్షయ్ కుమార్, అమీర్ ఖాన్  వంటి నార్త్ హీరోలు మోస్ట్ డిసైరబుల్ ఫర్ ఎవర్” కాంపిటీషన్ లో నిత్యం పోటీ పడుతుంటారు. అయితే మహేష్ బాబూ బాక్స్ ఆఫీస్ హిట్స్ తో పాటు జనాలను కట్టుకునే విధంగా నడుచుకోవడంలో బలశాలి. ఈ క్రెడిట్ అందుకున్న మొట్టమొదటి సౌత్ హీరో మహేష్ కావడం విశేషం. 

అందుకే ఈ సారి మహేష్ మోస్ట్ డిసైరబుల్ ఫర్ ఎవర్ అనే కీర్తిని అందుకున్నాడు. మహర్షి సినిమాతో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్న మహేష్ ఇప్పుడు టైమ్స్ మ్యాగజైన్ ఇచ్చిన మరో గుర్తింపుకు మరింత హ్యాపీగా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. విజయవాడలో శుక్రవారం సినిమా విజయోత్సవాన్ని చిత్ర యూనిట్ ఘనంగా నిర్వహించనున్నారు.