బిగ్ బాస్ టికెట్ టు ఫినాలే అవకాశం ఇచ్చారు. దశల వారీగా బిగ్ బాస్ నిర్వహించే టాస్క్ లలో గెలిచి, చివరి వరకు ఉన్న ఒక కంటెస్టెంట్ నేరుగా ఫైనల్ కి చేరుకునే అవకాశం ఇచ్చాడు. దీనిలో భాగంగా బిగ్ బాస్ నిన్న ఒక టాస్క్ నిర్వహించాడు. గార్డెన్ ఏరియాలో ఉంచిన ఆవు బొమ్మ నుండి పాలు సేకరించాలని, మూడు బజర్స్ మోగే సమయానికి ఎక్కువ పాలు సేకరించిన నలుగురు సభ్యులు తదుపరి దశకు వెళతారని చెప్పాడు. 

ఈ టాస్క్ లో ఎక్కువ పాలు సేకరించడానికి ఇంటి సభ్యులు అందరూ ఆవు బొమ్మ దగ్గర తోపులాటకు దిగారు. ఈ క్రమంలో మోనాల్ అవినాష్ ని కాలితో తన్నింది. దీనికి అవినాష్ చాలా ఫీలయ్యాడు. ఈ విషయంలో అఖిల్, సోహైల్ కూడా మోనాల్ కి మద్దతుగా నిలవడం, అవినాష్ ని మరింత ఆవేదనకు గురిచేసింది. ఐతే ఈ విషయంలో సోహైల్, అభిజిత్ మధ్య డిస్కషన్ జరిగింది. కాలితో తన్నడం చాలా తప్పని, నిజంగా మోనాల్ అది చేస్తే కొరుకునేది లేదన్నాడు. ఈ విషయంలో మొదట మోనాల్ నేను డబ్బాను తన్నానని అబద్దం చెప్పింది. గట్టిగా అడగడంతో నాకు క్లారిటీ లేదని చెప్పింది. 

ఈ సంఘటన ప్రేక్షకులలో తనకు చెడ్డ పేరు తెస్తుందని భావించిన మోనాల్, ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేసింది. దీని కోసం మోనాల్ దగ్గరకు వచ్చి, కావాలని చేయలేదని సారీ చెప్పింది. అలాగే మోనాల్ అవినాష్ కాళ్ళు పట్టుకోబోయింది. దానికి అవినాష్ ఒప్పుకోలేదు. నువ్వు ఇలా చేసి నన్ను విలన్ చేయకు అని అన్నాడు. మొత్తంగా అవినాష్ ని తన తెలివి తేటలతో కూల్ చేసే ప్రయత్నం చేసింది.