మేము విడిపోలేం అన్నంతగా బిగ్ బాస్ హౌస్ లో అఖిల్ మరియు మోనాల్ ప్రేమాయణం సాగింది. వీరిద్దరి లవ్ స్టోరీ బిగ్ బాస్ సీజన్ 4 హైలెట్ కాగా, హౌస్ లో సందు దొరికితే ముద్దులు, హగ్గులతో రెచ్చిపోయేవారు. అప్పుడప్పుడూ గొడవపడ్డా మళ్ళీ ఒకటైపోయేవారు. వీరి ప్రేమ బంధం గురించి హోస్ట్ నాగార్జున ప్రముఖంగా మాట్లాడారు. వీకెండ్స్ లో ఇద్దరూ మ్యాచింగ్ డ్రెస్ లలో దర్శనం ఇచ్చేవారు. అలాగే గేమ్ అండ్ టాస్క్ లలో ఒకరికి మరొకరు మద్దతుగా నిలిచేవారు. 
 
ఇక బిగ్ బాస్ హౌస్ లో మోనాల్ జర్నీ 14వ వారం ముగిసింది. ఫినాలేకు ముందు వారం చివరి ఎలిమినేషన్ ద్వారా ఆమె బయటికి రావడం జరిగింది.  మోనాల్ వెళుతూ వెళుతూ అఖిల్ కి గట్టిగా హగ్స్ ఇచ్చారు. అఖిల్ మాత్రం చాల సేపు షాక్ లో ఉండిపోయారు. మోనాల్ ఎలిమినేటై వెళ్లిపోతుంటే అతడు సర్వస్వం కోల్పోయినవాడిగా ఫీలయ్యారు. కాగా మరో రెండు రోజులలో ఫైనల్ అనగా బిగ్ బాస్ హౌస్ లోకి మోనాల్ రీ ఎంట్రీ ఇచ్చింది. 
 
వస్తూ వస్తూనే అఖిల్ కి మోనాల్ హగ్గులు, ముద్దులు ఇచ్చింది. అయితే వీరికి మధ్య ఓ గ్లాస్ అడ్డుగా ఉంది. కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో బయటి నుండి హౌస్ లోకి వచ్చిన కంటెస్టెంట్స్ ని భౌతికంగా కలిసే అవకాశం బిగ్ బాస్ కల్పించలేదు. మధ్యలో గ్లాస్ ఉన్నందుకు ఆమె చాలా ఫీలయ్యారు. ఇక మోనాల్ తో పాటు లాస్య, గంగవ్వ, కుమార్ సాయి, అవినాష్, కరాటే కళ్యాణి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు.