Asianet News TeluguAsianet News Telugu

అఖిల్ పై బెంగతో మోనాల్ కి నిద్ర కరువు... రోజూ మూడు అవుతుందట!

శుక్రవారం ఎపిసోడ్ లో కొన్ని ఆసక్తికర విషయాలు చోటు చేసుకున్నాయి. హౌస్ నుండి ఎలిమినేటైన కంటెస్టెంట్స్ ని మరలా ప్రవేశ పెట్టారు. మొదట మోనాల్ బిగ్ బాస్ హౌస్ లోకి రావడం జరిగింది.

monal missing very badly akhil after eliminated from bigg boss house ksr
Author
Hyderabad, First Published Dec 19, 2020, 1:00 AM IST
బిగ్ బాస్ సీజన్ 4 ముగింపు దశకు చేరుకుంది. ఈ ఆదివారం బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఎవరనేది తేలిపోనుంది. కాగా శుక్రవారం ఎపిసోడ్ లో కొన్ని ఆసక్తికర విషయాలు చోటు చేసుకున్నాయి. హౌస్ నుండి ఎలిమినేటైన కంటెస్టెంట్స్ ని మరలా ప్రవేశ పెట్టారు. మొదట మోనాల్ బిగ్ బాస్ హౌస్ లోకి రావడం జరిగింది. మోనాల్ రాకను గమనించిన అఖిల్... పరుగున వెళ్లి కలుసుకునే ప్రయత్నం చేశాడు. అయితే వీరిద్దరికీ మధ్య గ్లాస్ అడ్డుగా ఉండడంతో కేవలం చూసుకోవడానికే వీలుంది. 
 
గ్లాస్ మధ్యలో ఉన్నా... ఇద్దరూ ముద్దులతో రెచ్చిపోయారు. హగ్స్ కూడా చేసుకున్నారు. ఇక హౌస్ లోనుండి బయటికి వెళ్లిన తరువాత తనకు అసలు నిద్రపట్టలేదని మోనాల్ అఖిల్ తో చెప్పింది. రోజూ పడుకోవడానికి మూడు, నాలుగు అవుతుందని ఆమె చెప్పడం జరిగింది. అఖిల్ అందుకుంటూ తన పరిస్థితి కూడా అదేనని, నువ్వు వెళ్ళిపోయిన రోజు అసలు నిద్ర పట్టలేదని కాసేపు పులిహోర కలిపాడు. 
 
ఇక హౌస్ లో ఉన్న ఐదుగురు ఫైనలిస్ట్స్ తో మోనాల్ మాట్లాడారు. ఆ తరువాత ఆమె బెలూన్స్ పైకి వదులుతూ... ఒక్కొక్కరికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. కాగా  హౌస్ లోకి వస్తూ మోనాల్ వేసుకున్న డ్రెస్ చాలా హాట్ గా ఉంది. ముఖ్యంగా ఆమె క్లీవేజ్ షోతో, యద భాగం ఆల్మోస్ట్ చూపించేసింది . హౌస్ నుండి బయటికి వెళ్లినా, మోనాల్ మాత్రం ఎక్స్ పోజ్ చేయడం తగ్గించలేదు. 
 
Follow Us:
Download App:
  • android
  • ios