అఖిల్‌, మోనాల్‌ బిగ్‌బాస్‌ 4 హౌజ్‌లో ప్రేమ పావురాలుగా వెలిగారు. వీరిద్దరు తెగ పులిహోర కలుపుకున్నారు. అఖిల్‌, సోహైల్‌ మంచి స్నేహితులుగా ఉన్నారు. వీరిద్దరిలో ఎవరు `బిగ్‌బాస్‌4` టైటిల్‌ విన్ అయినా  మరొకరికి బైక్‌, ల్యాప్‌ ట్యాప్‌ కోనివ్వాలని డీల్‌ కుదుర్చుకున్నారు. కానీ వీరిద్దరిలో ఎవరూ టైటిల్‌ విన్‌ కాలేదు. సోహైల్‌ తనకు వచ్చిన 25 లక్షల ఆఫర్‌ని తీసుకుని జాక్‌పాట్‌ కొట్టేశాడు. కానీ అఖిల్‌ బకరా అయ్యారు. అయితే సోహైల్‌తో, అఖిల్‌కి బైక్‌, ల్యాప్‌ట్యాప్‌ డీల్‌ అలానే ఉండిపోయింది. 

ఈ డీల్‌ని ఫుల్‌ఫిల్‌ చేసింది అఖిల్‌ ప్రియురాలు మోనాల్‌. అఖిల్‌కి ల్యాప్‌ట్యాప్‌ ని గిఫ్ట్ గా ఇచ్చి సర్‌ప్రైజ్‌ చేసింది. దీంతో ఆయన ఆనందానికి అవదుల్లేవని చెప్పొచ్చు. సంతోషంతో ఉప్పొంగిపోయాడు. ఇటీవల అఖిల్‌కి పూల డిజైన్‌తో కూడిన ఎర్ర చొక్కాని గిఫ్ట్ గా ఇచ్చింది మోనాల్‌. దీంతో మోనాల్‌కి థ్యాంక్స్ చెప్పాడు అఖిల్‌. `నాకు తెలుసు, ఈ చొక్కాలో నేను చాలా హాట్‌గా కనిపిస్తున్నా కదూ` అంటూ ఇన్‌స్టా స్టోరీస్‌లో ఫోటో పెట్టాడు. దీంతో వీరిద్దరు హౌజ్‌ నుంచి బయటికి వచ్చాక కూడా తమ స్నేహాన్ని కొనసాగిస్తున్నారు. ఇద్దరు కలుసుకుంటూ హంగామా చేస్తున్నారు.

ఇదిలా ఉంటే మోనాల్‌ ఓ వైపు `స్టార్‌మా`లో `డాన్స్ ప్లస్‌` షోలో జడ్జ్ గా వ్యవహరిస్తుంది. మరోవైపు ఇటీవల `అల్లుడు అదుర్స్` సినిమాలో ఐటెమ్‌ సాంగ్‌ చేసిన విషయం తెలిసిందే. కానీ అఖిల్‌కి ఇంకా ఎలాంటి సినిమా ఆఫర్స్ రావడం లేదు. ఆయన ఇటీవల యూట్యూబ్‌ ఛానెల్‌ ప్రారంభించినట్టు తెలుస్తుంది.