బిగ్ బాస్ సీజన్ 4 లో పాల్గొన్న మోనాల్ భారీ క్రేజ్ సంపాదించారు. ఆమెకు బుల్లితెర షోలతో పాటు వెండితెరపై కూడా అవకాశాలు వస్తున్నాయి. సంక్రాంతి కానుకగా విడుదలైన అల్లుడు అదుర్స్ మూవీలో మోనాల్ ఓ స్పెషల్ సాంగ్ లో కనిపించిన విషయం తెలిసిందే.  బెల్లంకొండ సాయి శ్రీనివాస్, సోనూ సూద్ తో కలిసి ఆమె స్టెప్స్ వేయడం జరిగింది. కాగా మోనాల్ మరో బంపర్ ఛాన్స్ కొట్టేసిందంటూ వార్తలు వస్తున్నాయి. 

దర్శకుడు పరుశురామ్ సూపర్ స్టార్ మహేష్ తో సర్కారు వారి పాట మూవీ చేస్తున్నారు. ఇటీవలే ఈ చిత్ర ఫస్ట్ షెడ్యూల్ దుబాయ్ లో మొదలైంది. కాగా ఈ మూవీలో స్పెషల్ సాంగ్ లో నటించే అవకాశం మోనాల్ దక్కించుకున్నారంటూ వార్తలు వచ్చాయి.  సర్కారు వారి పాట మూవీలో ఐటెం సాంగ్ కోసం మోనాల్ ఎంపికయ్యారని, ఆమె మహేష్ తో కలిసి స్టెప్స్ వేయనున్నారంటూ వార్తలు రావడం జరిగింది. 

కాగా ఈ వార్తలపై మోనాల్ స్పందించారు. సర్కారు వారి పాట చిత్రంలో తాను స్పెషల్ సాంగ్ చేస్తున్నాను అన్న వార్తలలో ఎటువంటి నిజం లేదని తెలియజేశారు. ఆ మూవీలో స్పెషల్ కోసం నన్ను ఎవరూ సంప్రదించలేదని ఆమె స్పష్టత ఇచ్చారు. ఇక మోనాల్ స్టార్ మా లో ప్రసారం అవుతున్న డాన్స్ ప్లస్ షోకి జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు. అలాగే పలు క్రేజీ ఆఫర్స్ ఆమెకు వస్తున్నట్లు సమాచారం అందుతుంది.