---సూర్య ప్రకాష్ జోశ్యుల

మొదటి నుంచి మనకు క్రైమ్ థ్రిల్లర్స్ అందిస్తూ వస్తోంది మళయాళ చిత్ర పరిశ్రమే. అప్పట్లో సురేష్ గోపి తో చేసిన  క్రైమ్ థ్రిల్లర్స్ తెలుగు వారిని ఎట్రాక్ట్ చేసేవి. ఓ రకంగా మళయాళం నుంచి మనకు శృంగార చిత్రాలు తర్వాత ఆకట్టుకున్నకున్న సినిమాలు ఇవే. అయితే ఈ మధ్యన వాటి స్పీడు తగ్గింది. కొత్త జనరేషన్ కూడా డిఫరెంట్ సినిమాలు చేస్తోంది కానీ క్రైమ్ సినిమాలను మాత్రం అందించటం లేదు.కానీ రీసెంట్ గా  మోహన్‌ లాల్, విశాల్, హన్సిక, రాశీ ఖన్నా, శ్రీకాంత్.. వంటి  తెలుగు జనాలకు సుపరిచితులైన నటులతో తెరకెక్కిన మలయాళ మల్టీస్టారర్ ‘విలన్’. ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్.  2017లో కేరళలో విడుదలై ప్రేక్షకాదరణ పొందింది. ఈ చిత్రాన్ని ఇప్పుడు తెలుగులోకి డబ్బింగ్ చేసి  విడుదల చేశారు. మరి ఈ క్రైమ్ కాన్సెప్టు మనవాళ్లకు నచ్చుతుందా..అసలు కథేంటి వంటి వివరాలు రివ్యూలో చూద్దాం...

 

కథేంటి:

ముగ్గురు వ్యక్తులు మర్డర్స్ అవుతారు.  ఆల్రెడీ వాలెంటరీ రిటైర్మెంట్ కు అప్లై చేసుకుని , ఏడు నెలల తర్వాత డ్యూటిలో చేరి అదే రోజు రిటైర్ కాబోతున్న టాస్క్ ఫోర్స్ ఏడీజీపీ మాథ్యూ (మోహన్ లాల్) ముందుకు ఈ కేసు వస్తుంది. ఒక్క రోజు మాత్రమే డ్యూటీ చేసే తను ఈ కేసు ని డీల్ చేయటానికి ఇష్టపడరు. కానీ  డీజీపి (సిద్దిఖీ) పట్టుదలతో ఒప్పించటంతో మాథ్యూ ఓకే అంటాడు. ఎందుకంటే మాథ్యూ ప్రతిభ సామాన్యమైనది కాదు..కేవలం క్రైమ్ జరిగిన ప్లేస్ చూస్తే చాలు ..ఆ క్రైమ్ ఎలా జరిగిందో పసిగట్టేస్తాడు. అలాంటివాడు రంగంలోకి దిగుతాడు.

హత్యకాబడ్డ వాళ్లు ముగ్గురూ ప్రముఖులే. క్లూ లు ఏమీ దొరకవు. కానీ మాథ్యూ మామూలోడు కాదు. కేసుని ఛాలెంజింగ్ గా తీసుకుని ఒక్కో ముడి మెల్లిగా విప్పటం మొదలెడతాడు. ఆ క్రమంలో కొన్ని షాకిచ్చే నిజాలు బయిటపడతాయి. ఈ కేసులో డాక్టర్ దువ్వూరి మదనగోపాల్ (విశాల్) అనే వ్యక్తి కు లింక్ ఉందని అర్దమవుతుంది. ఇంతకి మదన్ గోపాల్ ఎవరు..అతనికి  ఆ హత్యలకు ఉన్న సంబధం ఏమిటి ?  మాథ్యూ ఆ హత్యలు చేసిన వారిని పట్టుకున్నాడా ? లేదా ?  వంటి  విషయాలు తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే.

 

ఎలా ఉంది..?

మళయాళ వెర్షన్ ని తెలుగు కు వచ్చే సరికి దాదాపు ఇరవై ఐదు నిముషాలు దాకా లేపేసారు. అసలు ఇలాంటి సినిమాలకు ఒకదాని తర్వాత మరొకటి వచ్చే స్క్రీన్ ప్లే తో కూడిన సీన్స్ ముఖ్యం. వాటిలో ఏది లేపేసినా కుప్పలా మొత్తం కూలిపోతుంది. అలా కాకుండా అనవసరమైన సీన్స్ తో సినిమా నింపితే బోరు. ఇప్పుడు ఇరవై ఐదు నిముషాల పాటు ఎడిట్ చేయటంతో ...కొన్ని లింక్ లు పోయినట్లున్నాయి. చాలా సీన్స్ లాజిక్ లు కనపడవు. వీటితో చాలా చోట్ల అర్దమయ్యి..కానట్లు కథ,కథనం జరుగుతంది. స్లో నేరేషన్ కొంత దెబ్బ కొట్టింది. ఇలాంటి కథలు..కట్టె..కొట్టే...తెచ్చే అన్నట్లు స్పీడుగా వెళ్తేనే చూడగలం.  ఇంట్రస్టింగ్ ఎలిమెంట్స్ తో మొదలైన ఈ సినిమా రాను రాను బోర్ కొట్టేసింది. దాన్ని కూడా భరించగలిగితే ఈ  సినిమా నచ్చుతుంది. 

 

లీనం కాము..

ముఖ్యంగా ఈ సినిమాకు ఎమోషనల్ ఎటాచ్ మెంట్ మనకు ఉండదు. తెరపై ఏదో కథ జరుగుతుంది. మనం చూస్తున్నట్లే ఉంటాం కానీ ఎక్కడా లీనం కాకపోవటమే ఈ సినిమాకు ప్రధాన లోపం. దానికి తోడు సినిమా ఎక్కడా కూడా కొంచెం కూడా ఫన్, ఎంటర్నైమెంట్ అనేది కనపించదు. 

 

ఎవరెలా చేసారు..?

ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ స్టార్ కాస్టింగ్. మోహన్ లాల్ ఎప్పటిలా తన సహజ నటనతో అదరకొడతాడు. శ్రీకాంత్ విలన్ గా ఎంత ఎస్టాబ్లిష్ చేసినా మనకు క్యాజువల్ గానే అనిపిస్తాడు.. అంత విలనిజం మనకు కనపడదు. మనం శ్రీకాంత్ ని సాప్ట్ హీరోగా చూడటానికి అలవాటు పడి అలా అనిపిస్తోందేమో. ఇక విశాల్ , హన్సిక, రాశి ఖన్నా అంతా బాగానే చేసారు. డైరక్టర్ కూడా వీళ్లందరినీ బాగానే ఎలివేట్ చేసారు.

 

టెక్నికల్ గా ...

ఈ సినిమా సాంకేతికంగా బాగుంది. డైరక్టర్ కూడా షాట్ డివిజన్...సీన్స్ ఓపినింగ్స్ ఎండింగ్ వంటి విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. అయితే కథను కన్వీవ్ చేసే విధానమే రొటీన్ గా అనిపించింది. సంగీతం సోసోగా ఉంది. కెమెరా వర్క్, నిర్మాణ విలువలు ప్లస్ అయ్యాయి. 

 

ఫైనల్ థాట్..

‘ప్రతి హీరోలో ఒక విలన్ ఉంటాడు, ప్రతి విలన్ లో ఒక హీరో ఉంటాడు’  అనే కాన్సెప్టు చెప్పటానికి ఇంత సినిమా అక్కర్లేదేమో.. మొదట్లో వేసేసినా సరిపోయేది. 

 

రేటింగ్: 2.5/5 

నటీనటులు : మోహన్ లాల్, యాక్షన్ హీరో విశాల్, శ్రీకాంత్, హన్సిక, రాశీ ఖన్నా త‌దిత‌రులు.

సంగీతం : సుషిన్ శ్యామ్

స్క్రీన్ ప్లే : ఉన్నికృష్ణన్‌

ఎడిటర్ : సమీర్ మహమ్మద్

దర్శకత్వం : ఉన్నికృష్ణన్‌

నిర్మాత : రాక్ లైన్ వెంకటేశ్