మోహన్‌లాల్‌ మళయాళ హీరో అయినా  తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. ఆయనకు తెలుగులోనూ మంచి మార్కెట్‌ ఉంది. ‘జనతా గ్యారేజ్‌’ తర్వాత ఆయన నటించిన పలు మలయాళ చిత్రాలు తెలుగులో డబ్‌ అయ్యాయి. ఆయన నటించిన ‘మనమంతా’, ‘కనుపాప’, ‘మన్యంపులి’ తదితర సినిమాలు తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. 

మోహన్‌లాల్‌ మళయాళ హీరో అయినా తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. ఆయనకు తెలుగులోనూ మంచి మార్కెట్‌ ఉంది. ‘జనతా గ్యారేజ్‌’ తర్వాత ఆయన నటించిన పలు మలయాళ చిత్రాలు తెలుగులో డబ్‌ అయ్యాయి. ఆయన నటించిన ‘మనమంతా’, ‘కనుపాప’, ‘మన్యంపులి’ తదితర సినిమాలు తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా మన్యంపులి మంచి లాభాలను ఆర్జించి పెట్టింది. దాంతో ఆయన సినిమాలకు ఇక్కడా మంచి బిజనెస్ చేస్తున్నారు. తెలుగుని టార్గెట్ చేస్తూ ట్రైలర్, టీజర్స్ విడుదల చేస్తున్నారు.

తాజాగా సూపర్ స్టార్ మోహన్‌లాల్‌ హీరోగా మలయాళంలో రూపొందిన సినిమా ‘ఒడియన్’. శ్రీకుమార్ మేనన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో... ప్రకాశ్‌రాజ్‌, మంజూ వారియర్‌ ప్రధాన పాత్రలు పోషించారు. దగ్గుబాటి క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాను టెక్నికల్ గా హై స్టాండర్డ్స్ తో రూపొందిస్తున్నారు. 

సూపర్ పవర్స్ కలిగిన విభిన్నమైన పాత్రలో మోహన్ లాల్ కనిపించనున్నారు. ఈ సినిమాలో ఆయన విభిన్నమైన లుక్స్‌లో సందడి చేయనున్నారు. మలయాళంతోపాటు తెలుగులోనూ ఈ సినిమా డిసెంబరు 14న విడుదల కానుంది. తాజాగా ఈ చిత్రం తెలుగు టీజర్‌ను‌ విడుదల చేస్తే మంచి క్రేజ్ వచ్చింది. 

‘ఒడియన్‌.. వాడు చీకటి రాజ్యానికి రారాజు’ అనే డైలాగ్‌తో ట్రైలర్‌ ఆరంభమైంది. ‘ఇప్పుడు నా లక్ష్యం వాడే..’ అంటూ ఓ వ్యక్తిని చూపించారు మోహన్‌లాల్‌. ‘ఇంత వరకు నువ్వు నన్ను ఎన్నో రూపాల్లో చూసి ఉంటావు.. నువ్వు చూడని రూపం ఒకటి ఉంది..’ అని ఆయన చెప్పే డైలాగ్‌ సినిమాపై ఇంట్రస్ట్ ని పెంచింది. సప్సెన్స్ తో కూడిన సీన్స్ తో ఈ టీజర్‌ను రూపొందించారు.