మోహన్‌బాబు మీడియాపై ఫైర్‌ అయ్యారు. సబ్‌ రిజిస్టార్‌ ఆఫీస్‌కి వచ్చిన ఆయన్ని కవరేజ్‌ చేయడానికి వచ్చిన మీడియా ప్రతినిధులపై ఫైర్‌ అయ్యారు.

కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌బాబు మీడియాపై ఫైర్‌ అయ్యారు. సబ్‌ రిజిస్టార్‌ ఆఫీస్‌కి వచ్చిన ఆయన్ని కవరేజ్‌ చేయడానికి వచ్చిన మీడియా ప్రతినిధులపై ఫైర్‌ అయ్యారు. ఎందుకొచ్చారు మీరంటూ మండిపడ్డారు. బుద్ది లేదా అంటూ ఆయన మీడియాపై చిందులేశారు. అంతేకాదు లోగోలు లాక్కొండి అంటూ బౌన్సర్లని ఆదేశించారు. ప్రస్తుతం ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. 

'ఆ లోగోలు లాక్కొండయ్యా' అంటూ తన బౌన్సర్లకు సూచించారు. మీడియా ప్రతినిధులకు బుద్ధి లేదా? అంటూ తన నోటికి పని చెప్పారు. సీనియర్ నటుడైన మోహన్ బాబు తన ఆస్తికి సంబంధించి వీలునామా కోసం వచ్చినట్టు విశ్వసనీయ సమాచారం అందుతుంది. అయితే ఈ వ్యవహారం మీడియా దృష్టి పడకుండా ఆయన వ్యవహరించడంతో అక్కడ ఉన్నవారు ఏం జరుగుతుందోనని చూస్తూ ఉండిపోయారు. మీడియాపై చిందులు తొక్కిన వ్యవహారం, బౌన్సర్లు అత్యుత్సాహం ప్రదర్శించిన తీరు రాద్ధాంతం అయింది.

Scroll to load tweet…

దీనిపై నెటిజన్లు స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. డైలాగ్‌ కింగ్‌ అయితే మాత్రం సరిపోదు మాటలు కూడా బాగుండాలంటూ కామెంట్‌ చేస్తున్నారు. కవర్‌ చేస్తే ఏమైంది, అంతలా మండిపడాల్సిన అవసరం ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు. చెప్పే స్థితిలో ఉన్న మోహన్‌బాబు ఇలా చెప్పించుకునేలా చేయడం బాగా లేదని, ఆయన స్థాయికి ఇలా మాట్లాడటం సరికాదంటున్నారు. నెట్టింట రచ్చ చేస్తున్నారు.