గాలి నా క్లాస్ మేట్..తన మృతి కలచివేసింది-మోహన్ బాబు

First Published 7, Feb 2018, 2:47 PM IST
mohanbabu condollences to gali muddukrishnama naidu
Highlights
  • గాలి ముద్దుకృష్ణమనాయుడు మృతికి మోహన్ బాబు సంతాపం
  • గాలి తన క్లాస్ మేట్ అంటూ గతం గుర్తుచేసుకున్న మోహన్ బాబు
  • గాలి తనకు అత్యంత ఆప్తుడని, హఠాన్మరణం కలచి వేసిందన్న మోహన్ బాబు

మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత, ప్రస్తుత ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు హఠాన్మరణం తన మనసును తీవ్రంగా కలచివేసిందని సినీ నటుడు డాక్టర్ ఎం.మోహన్‌బాబు వెల్లడించారు. ఆతయన ఆత్మకు శాంతి చేకూరాలని.. కుటుంబానికి, నియోజకవర్గ ప్రజలకు శిరిడి సాయినాథుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాని తెలిపారు. ఈ మేరకు ముద్దుకృష్ణమ మృతికి తన సంతాపాన్ని తెలియజేస్తూ మంగళవారం ఉదయం ఒక ప్రకటనను మోహన్‌బాబు విడుదల చేశారు.

‘తిరుపతిలో చదువుకునే రోజుల్లో నేనూ, ఆయన ఒకే రూమ్‌లో ఉండేవాళ్లం. ఆయన బ్రదర్ నా క్లాస్ మేట్. నాకు అత్యంత సన్నిహితుడు గాలి ముద్దుకృష్ణమనాయుడు. ఎన్నికల సమయంలో ఆయన తరపున ఎన్నోసార్లు ప్రచారానికి కూడా వెళ్లాను. అలాంటి మిత్రుడి హఠాన్మరణం నా మనసును కలచి వేసింది’ అని మోహన్‌బాబు తన ప్రకటనలో పేర్కొన్నారు. మోహన్‌బాబుతో పాటు పలువురు ముద్దుకృష్ణమ మృతికి తమ సంతాపాన్ని తెలియజేశారు.

loader