ఎన్టీఆర్ ను ఛాలెంజ్ చేస్తున్నాడు!

mohan lal challenge to ntr
Highlights

'హమ్ ఫిట్ తో ఇండియా ఫిట్' అనే పేరుతో కేంద్రమంత్రి రాజ్యవర్ధన్ సింగ్ హృతిక్ రోషన్

'హమ్ ఫిట్ తో ఇండియా ఫిట్' అనే పేరుతో కేంద్రమంత్రి రాజ్యవర్ధన్ సింగ్ హృతిక్ రోషన్, విరాట్ కోహ్లి, సైనా నెహ్వాల్ లకు ఛాలెంజ్ విసిరారు. ఈ క్రమంలో వారు ఛాలెంజ్ ను స్వీకరించి కసరత్తులు చేసిన వీడియోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు.

ఆ తరువాత చాలా మంది సెలబ్రిటీలు ఈ ఛాలెంజ్ ను స్వీకరిస్తూ కసరత్తులు చేస్తూ తమ స్నేహితులకు సవాలు విసిరారు. టాలీవుడ్ కు చెందిన అఖిల్, నాగ చైతన్య, సమంత, నిధి అగర్వాల్ ఇలా చాలా మంది ఈ ఛాలెంజ్ లో పాల్గొన్నారు. తాజాగా మోహన్ లాల్ ఈ ఛాలెంజ్ స్వీకరించి కసరత్తులు చేసి ఎన్టీఆర్, సూర్య, పృధ్వీరాజ్ వంటి తరాలకు సవాలు విసిరారు. మరి వారు ఈ సవాల్ ను స్వీకరిస్తారో లేదో చూడాలి!
 

loader