ఇండస్ట్రీకి పెద్దగా చిరంజీవి.. మోహన్‌బాబు షాకింగ్ రియాక్షన్.. నా ఓటు వారికే అంటూ..
మోహన్‌బాబు తాజాగా ఇండస్ట్రీ పెద్దరికంపై స్పందించారు. దాసరి నారాయణ రావు వెళ్లిపోయాక ఆయన స్థానాన్ని భర్తీ చేసేవాళ్లు లేకపోవడంతో తాజాగా ఆయన స్పందన షాకిచ్చేలా ఉండటం విశేషం.

మోహన్‌బాబుకి, చిరంజీవికి మధ్య తరచూ విభేదాలు అనే వార్తలు వినిపిస్తుంటాయి. వీరిద్దరి మధ్య జరిగే సంఘటనలు కూడా కొన్ని అలానే ఉంటాయి. ముఖ్యంగా మెగా ఫ్యామిలీకి, చిరంజీవికి వ్యతిరేకంగా మంచు ఫ్యామిలీ వ్యవహరిస్తుందంటూ ప్రచారం జరుగుతుంటుంది. చిరంజీవికి, మోహన్‌బాబుకి పడటం లేదంటూ వార్తలు చక్కర్లు కొడుతుంటాయి. ఆ మధ్య `మా` ఎలక్షన్ల విషయంలోనూ అదే జరిగింది. ఆ సమయంలో ఇద్దరి పరోక్ష ఆరోపణలు, విమర్శలు తారాస్థాయికి వెళ్లాయి. దీంతో వీరి మధ్య దూరం మరింతగా పెరిగిపోయింది.
ఆ సమయంలో ఇండస్ట్రీ పెద్ద అనే వాదన కూడా తెరపైకి వచ్చింది. మోహన్‌బాబు పెద్దరికం తీసుకోవాలని నరేష్ కామెంట్ చేశారు. మంచు విష్ణు కూడా కాస్త ఘాటుగానే వ్యాఖ్యానించారు. చిరంజీవి పెద్దరికానికి సంబంధించి పరోక్ష విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఓ సందర్భంగా చిరు మాట్లాడుతూ తాను పెద్దరికం తీసుకోవడం లేదని, ఇండస్ట్రీ పెద్దగా కాదు, బిడ్డగా ఉంటానని తెలిపారు. ఇండస్ట్రీ పెద్దగా అని ఎవరూ పిలవొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. కానీ ఏపీలో టికెట్ల రేట్ల విషయంలో చిరు తీసుకున్న ఇనిషియేట్‌కి సంబంధించి రాజమౌళి వంటి వారు ఆయన్ని ఇండస్ట్రీ పెద్దగా వర్ణిస్తూ వచ్చారు.
ఇదిలా ఉంటే తాజాగా మోహన్‌బాబుకి ఇండస్ట్రీ పెద్దరికానికి సంబంధించిన ప్రశ్న ఎదురయ్యింది. మోహన్‌బాబు ఓ యూట్యూబ్ ఛానెల్(సుమన్ టీవీ)కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దీనిపై స్పందించారు. దాసరి నారాయణరావు చనిపోయాక ఆయన లెగసీ, పెద్దరికాన్ని తీసుకెళ్లే వారు కనిపించడం లేదు, ఆ లోటు అలానే ఉంది, దాన్నీ మీరు ఫిల్ చేసే అవకాశం ఉందా అని ప్రశ్నించగా, దీనికి మోహన్‌బాబు స్పందించారు. ఊహించిన సమాధానం చెప్పారు. పెద్దరికంపై ఆయన ఆసక్తిగా ఉన్నారని, దానిపై పాజిటివ్‌గా రియాక్ట్ అవుతారని భావించారు. కానీ ఆయన షాకింగ్ ఆన్సర్ ఇచ్చారు.
`ఎవరైనా ఆయన(దాసరి) స్థానాన్ని ఆక్యుపై చేస్తానంటే వారికి ఓటేస్తాను. కానీ ఆ పెద్దరికం నాకొద్దు, మన వల్ల కాదు. నాకు చాలా పనులు ఉన్నాయి. నా వల్ల కాదని చెప్పారు. ఎవరు చేస్తారనేది నాకు తెలియదని, ఎవరైనా ఆ స్థానాన్ని తీసుకుంటే వారికి వెల్‌కమ్ చెబుతానని తెలిపారు. వారిని అప్రిషియేట్ చేసి, కౌగిలించుకుని ముద్దు పెట్టుకుంటానని తెలిపారు. ఇంతలో `చిరంజీవిని అనుకుంటున్నారు అందరు `అని యాంకర్ చెప్పగా, ఆయన్ని అప్రిషియేట్ చేస్తానని, వెల్‌కమ్ చెబుతానని అన్నారు మోహన్‌బాబు. ఇండస్ట్రీ నాయకత్వాన్ని ఎవరైనా తీసుకోవచ్చు అని, ఇండస్ట్రీ ఒకరి సొత్తు కాదన్నారు మోహన్‌బాబు. అందరూ నాయకులే, అందరు గొప్పవాళ్లే అని వెల్లడించారు. మోహన్‌బాబు కామెంట్ ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తుంది.