శ్రీరెడ్డి గొడవపై మోహన్ బాబు ఏమన్నారంటే!

mohan babu comments on sri reddy issue
Highlights

కాస్టింగ్ కౌచ్ కు సంబంధించిన వ్యవహారాలతో టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది శ్రీరెడ్డి

కాస్టింగ్ కౌచ్ కు సంబంధించిన వ్యవహారాలతో టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది శ్రీరెడ్డి.. ఇప్పటికీ పలువురు సినీ తారలపై ఆరోపణలు చేస్తూ తరచూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తూనే ఉంది. అయితే తాజాగా ఈ వ్యవహారంపై స్పందించిన టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు. శ్రీరెడ్డి పేరును నేరుగా ప్రస్తావించకుండా.. ఈ విషయంపై స్పందించారు.

''ఇండస్ట్రీలో చోటుచేసుకున్న పరిణామాల కారణంగా నేను కుమిలిపోయాను. ఆ సమయంలో నేను అమెరికాలో ఉండిపోయాను. జరిగిందంతా తెలిసి బాధపడ్డాను. అయ్యో మా గురువు దాసరి గారు లేరే అని ఆయనను తలచుకుంటూనే ఉన్నాను. కానీ ఇప్పుడు ఎవరూ ఏం చేయలేని పరిస్థితి తయారైంది. కళామతల్లికి వచ్చిన కష్టం నన్ను కలచివేస్తుంది. పరిశ్రమ తల్లి లాంటది. కొంచెం చిన్నా పెద్దా గమనించి ఎవరైనా ఏదైనా మాట్లాడాలి'' అంటూ వెల్లడించారు. 

loader