భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బయోపిక్ కూడా ప్రేక్షకుల ముందుకు రావడానికి వేగంగా సిద్ధమవుతోంది. ఎన్నికల హడావుడిలోనే ఈ బయోపిక్ కూడా ప్రధాన పాత్ర పోషిస్తుందని కథనాలు వెలువడుతున్నాయి. మోడీ పాత్రలో బాలీవుడ్ యాక్టర్ వివేక్ ఒబెరాయ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే సినిమాలో వివేక్ మోడీ జీవితంలో ఉన్న 10 గెటప్స్ ని చూపిస్తాడట. 

కొన్ని గెటప్స్ ని నేడు రిలీజ్ చేసిన ఈ హీరో ఎదో అద్భుతమే చేయనున్నాడు అని టాక్ వస్తోంది. మోడీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లో ఉన్న గెటప్ అలాగే ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టి ప్రధాని అయ్యేవరకు ఎలాంటి అడుగులు వేశారు అనేది సినిమాలో చూపించనున్నారట. ఒముంగ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 12న రిలీజ్ కానుంది. 

ఇక ఏప్రిల్ 17 నుంచి మే 19వరకు 7వ విడతలుగా లోక్ సభ ఎలక్షన్స్ జరగనుండగా.. మోడీ నియోజకవర్గం గుజరాత్ లో ఏప్రిల్ 23న ఎన్నికలు జరగనున్నాయి. అదే సమయంలో నరేంద్ర మోడీ బయోపిక్ వస్తుండడంతో నార్త్ స్టేట్ లో ఎన్నికలు ఎలాంటి ఫలితాన్ని చూపిస్తాయో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

MODI