బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా హాలీవుడ్ లో కూడా తన సత్తా చాటుతోంది. ప్రముఖ అమెరికన్ సింగర్ నిక్ జొనాస్ తో కొంతకాలంగా డేటింగ్ చేస్తోన్న ప్రియాంక ఇప్పుడు అతడితో పెళ్లికి సిద్ధమైంది. ఇటీవల ఎంగేజ్మెంట్ జరుపుకున్న ఈ జంట ఇప్పుడు పెళ్లి పనులు కూడా మొదలుపెట్టేసింది.

ఈ వేడుకకు ముఖ్య అతిథిగా భారత ప్రధాని నరేంద్రమోదీ రానున్నట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం. ఈరోజు నిక్ జొనాస్ డిల్లీకి చేరుకోనున్నారు. ప్రియాంక కూడా అక్కడే ఉంది. ఇద్దరూ కలిసి ప్రత్యేకంగా ప్రధానిని తమ పెళ్లి వేడుకకు ఆహ్వానించబోతున్నారని సమాచారం.

గతంలో టీమిండియా కెప్టెన్ కోహ్లి, అనుష్క శర్మ వివాహ విందుకి మోదీ అతిథిగా హాజరయ్యారు. నవంబర్ 28 నుండి డిసంబర్ 3 వరకు ప్రియాంక, నిక్ ల వివాహం వైభవంగా జరగనుంది.

హిందీ, క్రైస్తవ సంప్రదాయాల్లో ఈ జంట వివాహం చేసుకోనుందని తెలుస్తోంది. పెళ్లి తరువాత అమెరికాలో లాస్ ఏంజెల్స్ లో అలానే ముంబైలో రిసెప్షన్ ను ఏర్పాటు చేయనున్నారు.