Asianet News TeluguAsianet News Telugu

రాజమౌళి చేత మోహన్ లాల్ కు చెప్పిస్తారా?

ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి కుమారుడు ఎస్.ఎస్. కార్తికేయ నిర్మాతగా మారబోతున్న సంగతి తెలిసిందే. షోయింగ్ బిజినెస్ అనే నిర్మాణ సంస్థను నెలకొల్పిన ఆయన తొలి ప్రయత్నంగా ఆకాశవాణి పేరుతో ఓ సినిమాను నిర్మించబోతున్నారు.

Moahanlal act in Rajamuli's son movie Aakasavani?
Author
Hyderabad, First Published Dec 15, 2018, 4:49 PM IST

ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి కుమారుడు ఎస్.ఎస్. కార్తికేయ నిర్మాతగా మారబోతున్న సంగతి తెలిసిందే. షోయింగ్ బిజినెస్ అనే నిర్మాణ సంస్థను నెలకొల్పిన ఆయన తొలి ప్రయత్నంగా ఆకాశవాణి పేరుతో ఓ సినిమాను నిర్మించబోతున్నారు. రాజమౌళి వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన అశ్విన్ గంగరాజు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కానున్నారు. 

ఆకాశవాణి టైటిల్ తో రూపొందే ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ని సైతం ఇప్పటికే రిలీజ్ చేసారు. ఇక ఈ చిత్రంలో హీరోలంటూ ఎవరూ ఉండరని తెలుస్తోంది. కేవలం విలన్ పాత్ర చుట్టూ కథ తిరుగుతుందని, ఆ పాత్ర కోసం చాలా మందిని అనుకున్నా ..మోహన్ లాల్ అయితే బెస్ట్ అని దర్శక,నిర్మాతలు నిర్ణయించుకున్నారట. 

అయితే మోహన్ లాల్ ది పెద్ద మార్కెట్..భారీ రెమ్యునేషన్. బడ్జెట్ చూస్తే నాలుగు కోట్లు దాటకూడదని కార్తికేయ కండీషన్ పెట్టుకున్నారట. మరి మోహన్ లాల్ ని ఒప్పించాలంటే ఒకటే మార్గం..అది రాజమౌళి చేత చెప్పించటం. కానీ రాజమౌళి అందుకు ఒప్పుకుంటాడా అంటున్నారు. అయితే కార్తికేయ తన తండ్రి ఇన్ఫూలియెన్స్ వాడకుండా ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలనుకుంటన్నారట. కాబట్టి మోహన్ లాల్ ని తనే వెళ్ళి కథ చెప్పి ఒప్పిస్తే ఎలా ఉంటుందనే ప్లానింగ్ ఉన్నట్లు చెప్పుకుంటన్నారు. 

ఎస్.ఎస్. కార్తికేయ మాట్లాడుతూ.... పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో వైవిధ్యమైన కథ, కథనాలతో రూపొందనున్న చిత్రమిది. రెగ్యులర్ షూటింగ్ జనవరిలో ప్రారంభిస్తాం. నటీనటుల వివరాల్ని త్వరలో వెల్లడిస్తాం. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రంగా తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుంది అని తెలిపారు. 

ఈ సినిమాతో ఎం.ఎం. కీరవాణి తనయుడు కాలభైరవ సంగీత దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. ఈ చిత్రానికి సౌండ్ డిజైన్: రఘునాథ్, కాస్ట్యూమ్స్: సంజనా శ్రీనివాస్, సంభాషణలు: సాయిమాధవ్‌బుర్రా, సినిమాటోగ్రఫీ: సురేష్ రగతు, ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్, లైన్ ప్రొడ్యూసర్: శశాంక్, స్క్రీన్‌ప్లే: అశ్విన్ గంగరాజు, సందీప్ రాజ్, సాయికుమార్‌రెడ్డి.
 
 

Follow Us:
Download App:
  • android
  • ios