ఎంఎం శ్రీలేఖ సంగీత దర్శకురాలిగా, గాయనిగా గుర్తింపు సొంతం చేసుకుంది. ఆమెకి విజయేంద్ర ప్రసాద్ తండ్రి వరుస అవుతారు. అంటే రాజమౌళి సోదరుడు. శ్రీలేఖ ఇప్పటికి వరకు 80 పైగా చిత్రాలకు సంగీత దర్శకురాలిగా, గాయనిగా పనిచేశారు.
దర్శకధీరుడు రాజమౌళి కుటుంబం గురించి అందరికీ తెలిసిందే. రాజమౌళి భార్య రమా రాజమౌళి, కీరవాణి దంపతులు, కొడుకు కార్తికేయ, తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఇలా ఫ్యామిలీ మొత్తం చిత్ర పరిశ్రమలోనే ఉన్నారు. రాజమౌళి సినిమా అంటే వీరంతా ఒక్కొక్కరు ఒక్కో బాధ్యత తీసుకుని కలసి కట్టుగా పనిచేస్తారు.
అయితే ఎంఎం శ్రీలేఖ మాత్రం సంగీత దర్శకురాలిగా, గాయనిగా గుర్తింపు సొంతం చేసుకుంది. ఆమెకి విజయేంద్ర ప్రసాద్ తండ్రి వరుస అవుతారు. అంటే రాజమౌళి సోదరుడు. శ్రీలేఖ ఇప్పటికి వరకు 80 పైగా చిత్రాలకు సంగీత దర్శకురాలిగా, గాయనిగా పనిచేశారు. బాల్యం నుంచే చిత్ర పరిశ్రమలో తన ప్రయాణం మొదలయింది అని శ్రీలేఖ తెలిపారు. శ్రీలేఖ ఇండస్ట్రీకి వచ్చి 25 ఏళ్ళు పూర్తి చేసుకుంది.
ఈ సందర్భంగా హైదరాబాద్ లో ఒక కార్యక్రమం నిర్వహించగా.. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి నంద ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే విజయేంద్ర ప్రసాద్, వైవిఎస్ చౌదరి, అలీ లాంటి ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సంగీత దర్శకురాలిగా శ్రీలేఖ తన జర్నీగురించి చెబుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిన్నతనంలో కీరవాణిగారు చెప్పే రాగాలని వెంటనే నేర్చుకునే దానిని.
చాలా చిత్రాలకు సంగీత దర్శకురాలిగా పనిచేశా. కానీ ఎప్పుడూ మీ చిత్రంలో మ్యూజిక్ డైరెక్టర్ గా చేస్తాను అని రాజమౌళిని అడగలేదు. రాజమౌళి నా సోదరుడే. కానీ నేను ఎప్పుడూ ఒక్క అవకాశం అడగలేదు. సోదరుడు అయినంత మాత్రాన ఛాన్స్ ఇవ్వాలని రూల్ లేదు కదా అని అన్నారు.
రాజమౌళి చిత్రాలకు పెద్దన్న కీరవాణి గారే మ్యూజిక్ ఇస్తున్నారు. వారి మధ్య బంధాన్ని నేను తెంచాలని అనుకోవడం లేదు. చిత్ర పరిశ్రమలో ఎన్నో ఎడిదుడుకులు ఎదుర్కొన్నా. ఆస్తులు సంపాదించుకోలేదు కానీ అభిమానులని సొంతం చేసుకున్నా. ఇప్పటికి తాను అద్దె ఇంట్లో నివసిస్తున్నట్లు శ్రీలేఖ షాకింగ్ కామెంట్స్ చేశారు. తన పాతికేళ్ల కెరీర్ పురస్కరించుకుని 25 దేశాల్లో పర్యటించబోతున్నట్లు శ్రీలేఖ అన్నారు.
