టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ను తెలుగు దేశం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ విషయాన్ని స్వయంగా తన సోషల్ మీడియా పేజ్ లో వెల్లడించారు గంటా.  


టాలీవుడ్ స్టార్ హీరో .. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. Rc15 షూటింగ్ లో బిజీ బిజీగా గడిపేస్తున్నారు. సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో భారీ స్థాయిలో ఈమూవీ తెరకెక్కుతోంది. భారీ బడ్జెట్ తో ఈసినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తోంది. అయితే ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ప్రస్తుతం విశాఖపట్నంలో జరుగుతోంది. ఈ క్రమంలో షూటింగ్ సెట్ కు టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వెళ్లారు. 

వైజాగ్ లో షూటింగ్ జరిగే ప్రాంతానికి వెళ్లిన గంటా.. చరణ్, శంకర్ లను ప్రత్యేకంగా అభినందించారు. ఈ విషయాన్ని గంటా శ్రీనివాసరావు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. చరణ్, శంకర్ లతో దిగిన ఫొటోలను షేర్ చేశారు. ట్విట్టర్ లో ఆయన ఇలా రాసుకొచ్చారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు లెజండరీ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న భారీ చిత్రం RC15 మూవీ విశాఖపట్నం లో షూటింగ్ జరుపుకుంటున్న సందర్భంగా రాంచరణ్, శంకర్ మరియు మూవీ టీం ను సెట్స్ లో కలసి అభినందనలు తెలియజేయడం జరిగింది. అంటూ ట్వీట్ చేశారాయన. గతంలో మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలో గంటా శ్రీనివాసరావు ముఖ్య పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. మెగా ఫ్యామిలీతో మొదటినుంచీ గంటాకు మంచి అనుబంధం ఉంది. 

Scroll to load tweet…

ఇక రామ్ చరణ్ సినిమా విషయానికి వస్తే.. హైదరాబాద్ లోని ఛార్మినార్ దగ్గర షూటింగ్ కంప్లీట్ చేసుకున్న టీమ్.. కర్నూల్ కొండారెడ్డి బురుజు దగ్గర కొంత షెడ్యూల్ ను కంప్లీట్ చేసి.. వైజాగ్ చేరారు. ఇక్కడా కీలక షెడ్యూల్ షూటింగ్ ను కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు టీమ్. ఇక రామ్ చరణ్ పై ప్రత్యేకమైన పాటను కూడా చిత్రీకరించడానికి ఏర్పాట్లు జరుగుతున్నట్టు తెలుస్తోంది. దీని కోసం ప్రభుదేవాను కొరియోగ్రాఫర్ గా సంప్రదించారట శంకర్. దాదాపు 5 దేశాల్లో ఈపాట షూట్ చేస్తారని వినికిడి. 

ఇక ఈమూవీలో రామ్ చరణ్ జోడీగా కియారా అద్వాని నటిస్తుండగా.. ముఖ్యమైన పాత్రల్లో శ్రీకాంత్, నవీన్ చంద్ర, ఎస్.జే. సూర్య, అంజలి, సునిల్ నటిస్తున్నారు. శ్రీవెంకటేశ్వర పిక్చర్స్ బ్యానర్ లో ఇది 50వ సినిమా కావడంతో.. నిర్మాత దిల్ రాజు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈసినిమాను ఈసమ్మర్ బరిలో దించాలని చూస్తున్నారు.