వరుస అపజయాలతో కెరీర్ మొదట్లోనే ఇబ్బందిపడుతున్న అఖిల్ అక్కినేని నెక్స్ట్ హ్యాట్రిక్ డిజాస్టర్ నుంచి తప్పించుకుంటాడా లేదా అనేది ఆసక్తిగా మారింది. తొలిప్రేమ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో మూడవ సినిమా చేస్తోన్న అఖిల్ ఎలాగైనా హిట్ అందుకోవాలని కష్టపడుతున్నాడు. మిస్టర్ మజ్ను పై హైప్ క్రియేట్ చేసేవిధంగా అడుగులు వేస్తున్నాడు. 

ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ను అఖిల్ ను సంక్రాంతి బరిలో దింపాలని అలనుకున్నాడు. కానీ నిర్మాత నిర్ణయం మేరకు జనవరి 25కి రిలీజ్ చేయాలనీ ఫిక్స్ అయ్యారు. ఆ సమయంలో పోటీ కూడా గట్టిగా ఉండే అవకాశం ఉంది. రజినీకాంత్ పేట ఎన్టీఆర్ సెకండ్ పార్ట్ మహానాయకుడు అదే సమయంలో రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. 

దీంతో మిస్టర్ మజ్ను ఎంతవరకు పోటీని ఇస్తాడు అనేది సందేహంగా మారింది. ప్రస్తుతానికైతే సినిమాపై బజ్ పెద్దగా లేదు. పాటలతో థమన్ ఏదైనా చేస్తేనే ఇలాంటి సినిమాలకు ముందుగా హైప్ క్రియేట్ అవుతుంది. ప్రమోషన్స్ కోసం ఎలాగూ నాగ్ స్కెచ్ లు వేస్తూనే ఉంటారు కానీ హలో సినిమాకి ఎంత కష్టపడినా వర్కౌట్ అవ్వలేదు. మరి మజ్ను కథతో అఖిల్ మొదటి హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.