యంగ్ హీరో నితిన్ వరుస చిత్రాలతో బిజీ అవుతున్నాడు. ప్రస్తుతం నితిన్ ఛలో ఫేమ్ వెంకీ కుడుములు దర్శకత్వంలో భీష్మ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం డిసెంబర్ లో క్రిస్మస్ కానుకగా విడుదల కానుంది. ఇదిలా ఉండగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రంగ్ దే అనే చిత్రంలో కూడా నితిన్ నటించనున్నాడు. 

ఈ చిత్రం తర్వాత చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో నటించేందుకు నితిన్ కమిట్మెంట్ ఇచ్చాడు. సాహసం, మనమంతా లాంటి విభిన్నమైన చిత్రాలతో చంద్రశేఖర్ యేలేటి దర్శకుడిగా గుర్తింపు సొంతం చేసుకున్నాడు. నితిన్ తో తెరకెక్కించబోయే చిత్రం కూడా విభిన్నమైన కథాంశతోనే తెరకెక్కబోతోంది. 

ఈ చిత్రంలో హీరోయిన్ గా ఓ యంగ్ బ్యూటీని దర్శకుడు ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. మిస్ తెలంగాణ అవార్డు గెలుచుకున్న యంగ్ బ్యూటీ సిమ్రాన్ చౌదరి ఈ చిత్రంలో నితిన్ సరసన నటించే అవకాశం దక్కించుకున్నట్లు తెలుస్తోంది. 

సిమ్రాన్ చౌదరి ఇటీవల ఈ నగరానికేమైంది చిత్రంలో నటించింది. లుక్స్ పరంగా సిమ్రాన్ చౌదరి టాలీవుడ్ ని ఆకర్షిస్తోంది. భవిష్యత్తులో సిమ్రాన్ చౌదరి మరిన్ని అవకాశాలు అందుకుంటుందని అంచనా వేస్తున్నారు.