Asianet News TeluguAsianet News Telugu

లేడీస్ కోసం ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ స్పెషల్ షో.. ఎప్పుడంటే?

క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తున్న చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’. లేడీస్ కోసం ఈ చిత్రానికి స్పెషల్ షోగా ప్రదర్శించనున్నారు. సినిమాకు వస్తున్న రెస్పాన్స్  పట్ల అనుష్క కూడా స్పందించారు. 
 

Miss Shetty Mr Polishetty movie special show for Ladies NSK
Author
First Published Sep 12, 2023, 8:04 PM IST

యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty). స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి (Anushka Shetty) జంటగా నటించిన చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ (Miss Shetty Mister Polishetty).  యూవీ క్రియేషన్స్ నిర్మించగా మహేష్ బాబు పి దర్శకత్వం వహించాడు. సెప్టెంబర్ 7న ‘జవాన్’ చిత్రానికి పోటీగా విడుదలవడం విశేషం. తొలిరోజే ఈ చిత్రం పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం స్టడీగా కలెక్షన్లు రాబడుతోంది. 

ఈ చిత్రానికి ప్రభాస్, రానా, రామ్ చరణ్ వంటి పెద్దస్టార్స్ ప్రమోషన్ చేయడంతో మంచి హైప్ క్రియేట్ అయ్యింది. ప్రేక్షకాదరణ పొందడంతో పాటు ఐదురోజుల్లో ఈ చిత్రం రూ.28 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. రూ.14.6 కోట్ల షేర్ అందుకుంది. .యూఎస్ లో వన్ మిలియన్ మార్క్ అందుకుందీ సినిమా. ప్రస్తుతం స్టడీగా కలెక్షన్లు రాబడుతోంది. అయితే ఈ సినిమాను ఆడియెన్స్ కు మరింత చేరువ చేసేందుకు యూనిట్ ప్రయత్నిస్తోంది. 

అయితే, తమ సినిమాను ఇంతగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు, సినీ ప్రియులకు, ఇండస్ట్రీ సెలబ్రిటీస్ కు థాంక్స్ చెప్పింది హీరోయిన్ అనుష్క. ఈ గురువారం ఏపీ తెలంగాణలో లేడీస్ కోసం ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ స్పెషల్ షో ప్రదర్శించబోతున్నారని తెలిపారు. ఆడియెన్స్  నుంచి వచ్చే మెసేజెస్, ట్వీట్స్, ప్రేమ చూస్తుంటే చాలా ఆనందంగా ఉందని తెలిపింది. చిత్రంలో నవీన్ పొలిశెట్టి కామెడీ, అనుష్క ఎమోషనల్ సీన్స్ ఆకట్టుకునేలా ఉండటం.. పైగా చాలా గ్యాప్ తర్వాత ఇద్దరూ వెండితెరపై మెరవడంతో సినిమాకు మంచి ఆదరణ దక్కుతోంది. 

 

Follow Us:
Download App:
  • android
  • ios