Asianet News TeluguAsianet News Telugu

‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’పై దిల్ రాజ్ కామెంట్స్.. అదిరిన ‘శ్రీకాకుళం ఫోక్ సాంగ్’.. మూవీ అప్డేట్స్..

స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’పై ఇంట్రెస్టింగ్ గా కామెంట్స్ చేశారు. నటుడు శ్రీకాంత్ ‘కోట బొమ్మాళి పీఎస్’ చిత్రం నుంచి శ్రీకాకుళం ఫోక్ సాంగ్ విడుదలై ఆకట్టుకుంటోంది. ఈరోజు మూవీ అప్డేట్స్ ఇలా ఉన్నాయి.. 
 

Miss Shetty Mr Polishetty, Kota bommali movie Updates NSK
Author
First Published Sep 11, 2023, 8:52 PM IST

యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి జంటగా నటించిన ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’  (Miss Shetty Mr Polishetty) సినిమా సెప్టెంబర్ 7న గ్రాండ్ గా విడుదలైంది. పాజిటివ్ టాక్ తో పాటు స్టార్ హీరోలు, హీరోయిన్స్,, డైరెక్టర్స్ నుంచి ప్రశంసలు అందుకుంటోంది. తాజాగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు కూడా స్పందించారు. హైదరాబాద్ లోని యూవీ క్రియేషన్స్ ఆఫీస్ లో జరిగిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ.. తెలుగు ప్రేక్షకులు మంచి సినిమాలను ఆదరిస్తారని మరోసారి ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తో ప్రూవ్ చేశారు. ఈ సినిమా జవాన్ తో పాటు రిలీజైనా స్టడీగా నిలదొక్కుకుంది. నాలుగు వారాల దాకా ఈ సినిమా స్టడీగా వెళ్తుందనే నమ్మకం ఉంది. ఇవాళ మ్యాట్నీస్ కూడా ఫుల్ అయ్యాయి. నవీన్ కెరీర్ లో ఇది మూడో వన్ మిలియన్ డాలర్ మూవీ. జవాన్ ను తట్టుకుంటూ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’  సినిమా నిలబడగలిగింది. స్ట్రాంగ్ కలెక్షన్స్ తో ముందుకెళ్తోంది. అన్నారు.

దర్శకుడు మహేశ్ బాబు.పి. మాట్లాడుతూ.. తమ సినిమాను ఎంకరేజ్ చేస్తున్న దిల్ రాజుకు థ్యాంక్స్. చెప్పారు. ఆర్గానిక్ గా మా సినిమా మంచి టాక్ తెచ్చుకుని స్టడీగా థియేటర్స్ లో రన్ అవుతుండటం హ్యాపీగా అనిపిస్తోంది. మమల్ని సపోర్ట్ చేసిన రాజమౌళి గారికి, మహేశ్, రవితేజ, సమంత, డైరెక్టర్స్ వంశీ పైడిపల్లికి ధన్యవాదాలు. యూవీ క్రియేషన్స్ ప్రొడ్యూసర్ ప్రమోద్ మాట్లాడుతూ.. దిల్ రాజు అన్న మొదటి నుంచి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్స్. సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. నవీన్ యూఎస్ నుంచి వస్తున్నాడు. రాగానే సక్సెస్ సెలబ్రేషన్స్, సక్సెస్ టూర్ ప్లాన్ చేస్తున్నాం. 

Miss Shetty Mr Polishetty, Kota bommali movie Updates NSK

ఇక మరో అప్డేట్..  హీరో శ్రీకాంత్ లేటెస్ట్ ఫిల్మ్ Kota Bommali  నుంచి ఫస్ట్ సింగిల్ గా శ్రీకాకుళం మాస్ ఫోక్ సాంగ్ విడుదలైంది. శ్రీలీలా లాంచ్ చేసింది. ’లింగి లింగి లింగిడి‘ అనే టైటిల్ తో శ్రీకాకుళం జానపదం ఫుల్ సాంగ్ విడుదలై ఆకట్టుకుంటోంది. ఇప్పటికే హుక్ స్టెప్ ద్వారా విడుదల చేసిన పాట ప్రోమోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. లింగి లింగి లింగిడి అంటూ సాగిన శ్రీకాకుళం మాస్ జానపద పాటకు రేలారే ఫేమ్ పి.రఘు సాహిత్యం అందించడంతోపాటు స్వయంగా పాడిన తీరు అందర్నీ ఆకర్షిస్తుంది. ముకుందన్ పాటను కంపోజ్ చేయగా విజయ్ పోలకి అద్భుతమైన కొరియోగ్రఫీ అందించారు. కలర్ ఫుల్ సెట్లో రాహుల్ విజయ్ శివానితో కలిసి శ్రీకాంత్ చేసిన సింపుల్ డాన్స్ మూమెంట్స్ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ఈ పాటతో సినిమాపై అంచనాలు తిరుగుతున్నాయి. జోహార్, అర్జున ఫాల్గుణ వంటి చిత్రాలతో దర్శకుడిగా గుర్తింపునందుకున్న  తేజ మార్ని ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. గీతా ఆర్ట్స్ 2 సంస్థ నిర్మిస్తోంది. చిత్రంలో శ్రీకాంత్ తో పాటు వరలక్ష్మి శరత్‌కుమార్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ ప్రధాన పాతు పోషించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios